AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైసీపీతో బీజేపీ కుమ్మక్కయ్యిందా..? పురందేశ్వరి ఏమన్నారంటే..

Andhra Pradesh: వైసీపీతో బీజేపీ కుమ్మక్కయ్యిందా..? పురందేశ్వరి ఏమన్నారంటే..

Janardhan Veluru
|

Updated on: Feb 15, 2024 | 1:13 PM

Share

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అయితే టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పొత్తులపైనే వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అటు ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడం రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది.

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అయితే టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పొత్తులపైనే వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అటు ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడం రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలపై ప్రధాని మోదీతో జగన్ చర్చించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో బీజేపీ చేతులు కలపొద్దని జగన్ ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులను కోరినట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి. ఈ నేపథ్యంలో వైసీపీతో బీజేపీ అగ్రనాయకత్వం కుమ్మక్కైందన్న విమర్శలపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో తమ పార్టీ పోరాడుతోందని గుర్తుచేశారు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కై ఉంటే తామెందుకు అధికార వైసీపీతో పోరాటం చేస్తామని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశం కావడంపై రాద్ధాంతం అవసరం లేదన్నారు. సీఎం హోదాలో జగన్‌, రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిశారని, రాష్ట్రం గురించి చర్చించారని అన్నారు. పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తామని పురంధేశ్వరి అన్నారు.

 

Published on: Feb 15, 2024 01:11 PM