మీ వంటింట్లో ఉన్న ఈ 5 వస్తువులకు ఎక్స్పైరీ డేట్ లేదు.. కొన్నింటిలో రుచి పెరుగుతూనే ఉంటుంది..!

ఎప్పటికీ గడువు ముగియని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. పైగా రోజులు గడిచినా కొద్దీ ఈ ఆహారాల రుచి మరింత పెరుగుతుంది. మన అమ్మలకు, అమ్మమ్మలకు ఈ విషయం తెలుసు. కానీ ఈరోజుల్లో చాలా మందికి వీటి గురించి తెలియదు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఎప్పటికీ గడువు తీరని ఈ ఆహారాలు ఏవో తెలుసుకుందాం.

మీ వంటింట్లో ఉన్న ఈ 5 వస్తువులకు ఎక్స్పైరీ డేట్ లేదు.. కొన్నింటిలో రుచి పెరుగుతూనే ఉంటుంది..!
Foods That Never Expire
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 16, 2024 | 8:44 AM

ఇంట్లో ఉండే అవసరాల కోసం మనం కొన్ని నెలలకు సరిపడా అన్ని రకాల కిరాణ సామాన్లు ఒకేసారి తెచ్చుకుంటాం. అయితే కొద్దిరోజుల తర్వాత వాటిలో కొన్నింటికి ఎక్స్‌పైరీ డేట్‌ ముగిసిపోయి ఉంటుంది. దాంతో చేసేది లేక పారబోయాల్సి వస్తుంది. కానీ, ఎప్పటికీ గడువు ముగియని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. పైగా రోజులు గడిచినా కొద్దీ ఈ ఆహారాల రుచి మరింత పెరుగుతుంది. మన అమ్మలకు, అమ్మమ్మలకు ఈ విషయం తెలుసు. కానీ ఈరోజుల్లో చాలా మందికి వీటి గురించి తెలియదు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఎప్పటికీ గడువు తీరని ఈ ఆహారాలు ఏవో తెలుసుకుందాం.

ఎప్పటికీ ఎక్స్‌పైరీ డేట్‌లేని ఆహారాలు..

1. మరమరాలు..

వీటిని బియ్యం తో తయారు చేస్తారు.. అందుకే కొన్ని ప్రాంతాల్లో మరమరాలను పఫుడ్ రైస్ అని అంటారు. బియ్యానికి అధిక పీడనాన్ని అందించితే ఇవి తయారు అవుతాయి. ఇది బెస్ట్‌ టైమ్‌ పాస్‌ ఫుడ్‌ మాత్రమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే, ఇలా తయారు చేసిన మరమాలు ఎప్పుడూ చెడిపోవు. వాటికి ఎలాంటి గడువు తేదీ లేదు. మీరు ఇంట్లో పఫుడ్ రైస్‌ ఉంచితే, అది ఎప్పుడూ పాడవదు. అవి మెత్తగా మారినప్పటికీ, వాటిని బాణలిలో వేసి వేడి చేయండి. తర్వాత దాన్ని ఒక బాక్సులో సీల్ చేసి ఉంచాలి. మరమరాలలో విటమిన్‌ డి, విటమిన్‌ బి, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది చాలా తేలికైన ఆహారం, దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వీటిని రోజూ స్నాక్‌గా తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి, గడువు తీరని పఫుడ్‌ రైస్ తినండి.

ఇవి కూడా చదవండి

2. తేనె..

తేనెకు ఎప్పుడూ గడువు తీరదు. మీరు ఎప్పుడైనా తినవచ్చు. మరోవైపు, తేనెను ఎక్కువకాలం నిల్వ ఉంచడం మంచిది. రోజులు గడిచినా కొద్దీ దాని లాభాలు మరింత పెరుగుతాయి. మరింత ఉపయోగించవచ్చు. కాబట్టి, మీ ఇంట్లో తేనె ఎక్కువగా ఉంటే దాని గురించి చింతించకండి.. ఎందుకంటే అది చెడిపోదు.

3. వెనిగర్, ఊరగాయలు..

మిగిలిపోయిన వెనిగర్ లేదా నిల్వ పచ్చళ్లు, ఊరగాయ ఎక్కువగా ఉంటే కూడా చింతించాల్సి అవసరం లేదు. అది సంవత్సరాల తరబడి చెడిపోదు. మీరు దీన్ని ఎన్ని రోజులైన ఉపయోగించవచ్చు. వంటలలో వెనిగర్‌ను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. కొంతమంది పచ్చళ్లు లేని ఆహారం కూడా తినరు. కాబట్టి, ఈ రెండు పదార్థాలకు గడవు ముగింపు అనేది ఉండదు. ఎన్ని రోజులైన ఉపయోగించవచ్చు.

4. ఉప్పు..

ఉప్పుకు ఎప్పుడూ గడువు కాదు. మీరు దీన్ని చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు. ఇది నీరు లేదా గాలి సోకకుండా నిల్వ చేసుకుంటే.. ఉప్పు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. అందువల్ల, మీరు ఎప్పుడైనా ఎక్కువ ఉప్పును కొనుగోలు చేసినట్లయితే, దాని గురించి చింతించకండి. ఇది చెడిపోని ఆహార పదార్థం.

5. నెయ్యి..

నెయ్యి ఏళ్ల తరబడి ఉంటుంది. దీని రుచి కాస్త చప్పగా ఉండడంతో ప్రజలు మళ్లీ వేడి చేసి నిల్వ చేసుకుంటారు. ఈ విధంగా, ఇది చాలా కాలం పాటు ఉపయోగంలో ఉంటుంది. కాబట్టి, మీ వద్ద కూడా నెయ్యి ఉంటే లేదా మీరు ఇంట్లో నెయ్యి తయారు చేస్తుంటే, కొన్నాళ్లపాటు దానిని కదిలిస్తూ ఉండండి. మీరు దాని గడువు గురించి చింతించకూడదు. కాబట్టి, పదార్థాల గడువు తేదీ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC