Valentine’s Day2024: నీ వెంటే నేనంటూ.. ఓ ప్రేమికుడి జ్ఞాపకం.. ఆవుపై వికసించిన వాలెంటైన్స్ డే కళ ..

వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్లు, ప్రశంసలు, లైకులు చేస్తున్నారు. ఈ ఆవును కౌగిలించుకుని వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి..అంటూ ఒకరు కామెంట్ చేయగా, మరి కొందరు మీ ప్రేమ సఫలం అవుతుందని ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. ఈ వీడియో గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కానీ, ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

Valentine's Day2024: నీ వెంటే నేనంటూ.. ఓ ప్రేమికుడి జ్ఞాపకం.. ఆవుపై వికసించిన వాలెంటైన్స్ డే కళ ..
Valentine's Day
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 16, 2024 | 9:08 AM

Valentine’s Day2024: ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమికులు తమ అంతర్గత ప్రేమను వ్యక్తీకరించడానికి ఈ రోజును ఎంచుకుంటారు. ప్రేమ పక్షులుగా మారిపోయి.. పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో కలిసి విహరిస్తుంటారు. అందుకే ఫిబ్రవరి 14 న చాలా పార్కులు, బీచ్‌లు, అందమైన లోకేషన్స్‌ అన్నీ లైవ్‌ బర్డ్స్‌తో నిండిపోతాయి. ప్రేమించే మనసులకు ఇది వాలెంటైన్స్ డే.. అయితే, లైఫ్‌లో బిజీగా వారికి ఇది మరో రోజు. అంటే వారికి ఈ భావన లేదని కాదు. సమయం లేదు. దీని కోసం పరిగెత్తే వయస్సు కూడా ఇది కాదు. ఆవులకు మేత, నీరు, ఆహారం ఇస్తూ.. ఆవులను సంరక్షిస్తూ, డెయిరీలో పాలు పోస్తూ జీవనం గడుపుతున్న ఓ వ్యక్తి వాలెంటైన్స్‌డే రోజున ఎవరూ చేయని విధంగా ఎంజాయ్‌ చేశాడు.. ఆ వీడియో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియోలో ఒక పాలిచ్చే ఆవుపై అందమైన వాలెంటైన్స్ డే కళను చిత్రించాడు ఆ పశువుల కాపరీ. గులాబీ రంగు దుస్తులు ధరించిన అమ్మాయి, ఆమె వెనుక పూల గుత్తి పట్టుకుని నడుస్తున్న ఒక అబ్బాయి రూపాన్ని ఎంతో అద్భుతంగా ఆవుపై చిత్రీకరించాడు..ఇక ఆ నడుస్తూ వెళ్తుంటే.. ఒక అమ్మాయి నడిచినట్లుగా అనిపిస్తుంది..ఆమె వెనకాలే.. ఒక ప్రేమికుడు పుష్పగుచ్చంతో ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక యువకుడు ఆ ఆవును పట్టుకుని నడుస్తుంటే.. ఈ సీన్‌ వాస్తవ దృశ్యానికి ఏ మాత్రం తీసిపోకుండా కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వాలెంటైన్స్ డేకి నిజమైన అర్థాన్ని చెప్పాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆవుపై గీసి తన భావాలను కూడా వ్యక్తం చేశాడు. పలువురు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్లు, ప్రశంసలు, లైకులు చేస్తున్నారు. ఈ ఆవును కౌగిలించుకుని వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి..అంటూ ఒకరు కామెంట్ చేయగా, మరి కొందరు మీ ప్రేమ సఫలం అవుతుందని ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. ఈ వీడియో గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కానీ, ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. గోశాలే వాలెంటైన్స్ డే స్పాట్‌ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ చేయబడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..