AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి ప్రియురాలు శత్రువుకి కూడా వద్దు.. మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను పదేళ్లుగా వేధిస్తూనే ఉంది.. చివరికి అలా చేసి జైలు పాలు

2002లో తాను ఒకయువతిని కలిశానని.. ఆమె పేరు లీనా తంటాష్ అని రైస్ చెప్పాడు. తాను లీనాను ఒక కేఫ్‌లో కలుసుకున్నానని ఆ పరిచయం క్రమంగా స్నేహం అనంతరం ప్రేమ బంధంగా మారింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా క్రమ క్రమంగా సమయం గడిచేకొద్దీ లీనా చర్యలు జర్లాత్ రైస్ కు ఇబ్బందిగా మారాయి. ఈ రోజుల్లో ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన మాజీ ప్రియురాలు తనను పదేళ్లుగా వేధించిందని.. చివరకు తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు చేరుకున్నానని ఓ యువకుడు వెల్లడించాడు.

ఇలాంటి ప్రియురాలు శత్రువుకి కూడా వద్దు.. మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను పదేళ్లుగా వేధిస్తూనే ఉంది.. చివరికి అలా చేసి జైలు పాలు
Viral News
Surya Kala
|

Updated on: Feb 15, 2024 | 9:24 PM

Share

ప్రియుడు, ప్రియురాలి మధ్య తగాదాలు కొత్తేమీ కాదు. తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు తగాదాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ఒక్కసారి విడిపోయే పరిస్తితులకు దారి తీరస్తాయి. సాధారణంగా విడిపోయిన తర్వాత, ప్రియుడు, ప్రేయసి ఒకరి జీవితాల్లోకి మరొకరు తొంగి చూడకుండా వేర్వేరు మార్గాల్లో పయనిస్తారు. అయితే ఈ రోజుల్లో ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన మాజీ ప్రియురాలు తనను పదేళ్లుగా వేధించిందని.. చివరకు తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు చేరుకున్నానని ఓ యువకుడు వెల్లడించాడు.

ఈ వ్యక్తి పేరు జర్లాత్ రైస్. అతను ఐర్లాండ్‌కు చెందిన చిత్రనిర్మాత. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఇటీవల అతను ఒక డాక్యుమెంటరీ కోసం తన జీవితంలో అత్యంత కష్టతరమైన సమయానికి సంబంధించిన కథను పంచుకున్నాడు. ఈ కథ అందరికి షాకింగ్ కలిగించింది. 2002లో తాను ఒకయువతిని కలిశానని.. ఆమె పేరు లీనా తంటాష్ అని రైస్ చెప్పాడు. తాను లీనాను ఒక కేఫ్‌లో కలుసుకున్నానని ఆ పరిచయం క్రమంగా స్నేహం అనంతరం ప్రేమ బంధంగా మారింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా క్రమ క్రమంగా సమయం గడిచేకొద్దీ లీనా చర్యలు జర్లాత్ రైస్ కు ఇబ్బందిగా మారాయి.

విచిత్రమైన నియమాలు పెట్టిన ప్రియురాలు

ఇవి కూడా చదవండి

లీనా తన కోసం కొన్ని నియమాలు పెట్టిందని.. అవి చాలా విచిత్రంగా ఉన్నాయని జర్లాత్ రైస్ చెప్పాడు. వారానికి కనీసం మూడు రోజులైనా జర్లాత్ రైస్ తనతో గడపాలని, రోజూ సాయంత్రం 15 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడాలని, తనతో మంచిగా ఉండాలని ఆమె కోరుకుంది. అంతేకాదు తన మాట వినకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ నియమాలు రైస్‌కు చాలా షాక్ ఇచ్చాయి. అటువంటి పరిస్థితిలో అతను నెమ్మదిగా దూరం అయ్యే ప్రయత్నం చేస్తూ.. ఆమె నుండి తప్పించుకునే ప్రయత్నం ప్రారంభించాడు. అయినప్పటికీ లీనా అతనిని విడిచిపెట్టలేదు. ఫోన్‌లోనే కాకుండా మెసేజ్‌లు, ఈమెయిల్స్ ద్వారా అతడిని నిరంతరం వేధించడం మొదలు పెట్టింది.

ప్రియుడి వెనుక గూఢచారిని నియామకం

లీనా పెడుతున్న టార్చర్ ను భరించలేక రైస్ తన నంబర్ మార్చేవాడు. అయితే ఆ నంబర్ ఎలా లీనకు తెలిసేదో .. కొత్త నెంబర్ కు కాల్ చేసి.. లేదా మెసేజ్ లు పంపి అతన్ని వేధించడం ప్రారంభించింది. అంతేకాదు రైస్‌ ఎక్కడకు వెళ్తున్నాడో తెలుసుకోవడం కోసం ఏకంగా అతడిని అనుసరించడానికి ఒక గూఢచారిని కూడా నియమించింది. ఒకసారి లీనా అతన్ని చంపడానికి ప్రయత్నించింది. కడుపులో కత్తితో పొడిచింది. ఈ సంఘటన 2014 సంవత్సరంలో జరిగింది. ఆ సమయంలో రైస్ తన రెండవ ప్రియురాలితో ఉన్నాడు. ఈ సంఘటన అతన్ని ఎంతగానో భయపెట్టింది. దీంతో అతను దేశం విడిచిపెట్టాడు.. కానీ లీనా అతన్ని విడిచిపెట్టలేదు. ఆమె తన స్నేహితులలో ఒకరి ద్వారా ఫోన్ చేసి రైస్ బెదిరిస్తూ వేధించడం ప్రారంభించింది.

కోర్టు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది లీనా పెడుతున్న వేధింపులను భరించలేని రైస్ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు మెట్లు ఎక్కాడు. కోర్టు కఠినంగా వ్యవహరించడంతో పోలీసులు లీనాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆమె నేరం రుజువైంది. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ విధంగా రైస్ తన మాజీ స్నేహితురాలు లీనాను వదిలించుకున్నాడు. అయితే తనకు ఈ సంఘటన గుర్తుకొస్తే ఇప్పటికీ వణుకుతానని చెబుతాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..