Viral Video: ఈ అమ్మడు పిచ్చి అరికాళ్లకు వచ్చింది.. ఎలుక బోన్లతో హైహీల్స్.. వీడియో చూస్తే..

మోడల్స్ వింత దుస్తులతో ర్యాంప్ పై క్యాట్‌వాక్‌గా నడుస్తూ ఉంటారు. చాలా సార్లు ఫ్యాషన్ కోసం, యువతులు హీల్స్ చెప్పులను ధరిస్తారు. అయితే ప్రస్తుతం ఓ వింత హైహీల్స్ ధరించి నడుస్తున్న యువతికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో ఒక అమ్మాయి వింత హైహీల్స్ ధరించి కనిపించింది. ఈ దృశ్యం చూసి అందరూ ఇదేం ఫ్యాషన్ అని ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: ఈ అమ్మడు పిచ్చి అరికాళ్లకు వచ్చింది.. ఎలుక బోన్లతో హైహీల్స్.. వీడియో చూస్తే..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2024 | 7:49 PM

ప్రస్తుతం ప్రపంచం ఫ్యాషన్‌పైనే ఆధారపడి ఉంది. రకరకాల బట్టలు, షూలు, చెప్పులు మొదలైనవాటిని ధరించి కొందరు, మరి కొంత మంది విచిత్రమైన బట్టలు కూడా ధరించి కనిపిస్తారు. ఇలాంటి రకరకాల ఫ్యాషన్ షోలు ఎన్నో చూసి ఉంటారు. అందులో మోడల్స్ వింత దుస్తులతో ర్యాంప్ పై క్యాట్‌వాక్‌గా నడుస్తూ ఉంటారు. చాలా సార్లు ఫ్యాషన్ కోసం, యువతులు హీల్స్ చెప్పులను ధరిస్తారు. అయితే ప్రస్తుతం ఓ వింత హైహీల్స్ ధరించి నడుస్తున్న యువతికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో ఒక అమ్మాయి వింత హైహీల్స్ ధరించి కనిపించింది. ఈ దృశ్యం చూసి అందరూ ఇదేం ఫ్యాషన్ అని ఆశ్చర్యపోతున్నారు.

ఎలుకలు పంజరాలను ఉపయోగించి పట్టుకోవడం మీరు తప్పక చూసి ఉంటారు. అమ్మాయి అలాంటి బోనులను హైహీల్స్‌గా ఉపయోగించింది. వీడియోలో మీరు అమ్మాయి ధరించిన బూట్, దాని పై భాగం సాధారణ షూ లాగా ఉంది. చెప్పుల దిగువ భాగం పంజరంలా ఉంది. ఆ బోన్ లో బతికి ఉన్న ఎలుకలు ఉన్నాయి. వాటిని ఆ బోన్ లో లాక్ చేసి ఆపై దానికి ఒక మందపాటి షూ అమర్చబడి ఉంది. ఇలాంటి అసాధారణ శైలి, హై హీల్స్‌ను చాలా అరుదుగా చూసి ఉంటారు. ఈ అమ్మాయి ఇంత వింత హైహీల్స్ వేసుకుని ఎలా నడుస్తుందా అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Janette Ok (@inmyseams)

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagram లో inmyseams అనే IDతో భాగస్వామ్యం చేయబడింది, ఇది ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో 115 మిలియన్లు అంటే 11.5 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 2 మిలియన్లు లేదా 20 లక్షల మంది ప్రజలు వీడియోను ఇష్టపడ్డారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ఇది జీవరాశుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘మనిషి మూర్ఖత్వానికి హద్దులుండవు’ అని ఆగ్రహంతో తిట్ల దండకాన్ని ఇచ్చుకున్నారు. అదేవిధంగా కొంతమంది వినియోగదారులు ‘ఇప్పుడు ప్రపంచాన్ని రీసెట్ చేయడానికి సమయం ఆసన్నమైంది’ అని కూడా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..