మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు..
కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తరచుగా జూనియర్ విద్యార్థులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం వైద్య కళాశాలలో సీనియర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి జూనియర్ల హాస్టల్ రూమ్‌లోకి చొరబడి వేధింపులకు గురిచేశారు. ఇద్దరు విద్యార్థులకు గుండు కొట్టి, మీసాలు తొలగించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తరచుగా జూనియర్ విద్యార్థులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం వైద్య కళాశాలలో సీనియర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి జూనియర్ల హాస్టల్ రూమ్‌లోకి చొరబడి వేధింపులకు గురిచేశారు. ఇద్దరు విద్యార్థులకు గుండు కొట్టి, మీసాలు తొలగించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రామగుండం మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ, కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు విద్యార్థుల గదుల్లోకి సోమవారం రాత్రి సీనియర్లు మూకుమ్మడిగా చొరబడ్డారు. జూనియర్లను ప్రశ్నలతో వేధిస్తూ జుట్టు అంతలా ఎందుకు పెంచారని నిలదీశారు. అనంతరం ట్రిమ్మర్ తో గుండు చేసి, మీసాలు కూడా తొలగించారు. వారితో పాటు మరో ముగ్గురు విద్యార్థులను కూడా ర్యాగింగ్‌తో వేధించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేస్తున్న ఆగడాలతో విసిగిపోయిన జూనియర్లు మంగళవారం కాలేజీలో ఆందోళన చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు బైఠాయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో బయటపడ్డ అరుదైన వ్యాధి.. 14వ శతాబ్దంలో మూడోవంతు జనాభాను బలితీసుకున్న జబ్బు
Virtual ATM: OTP చెబితే చాలు.. డబ్బులిచ్చేస్తారు..
గుర్రం దిగు… నడిచి వెళ్లు దళితునికి అగ్రవర్ణాల బెదిరింపులు
శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..
కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు