Virtual ATM: OTP చెబితే చాలు.. డబ్బులిచ్చేస్తారు..

మీ ప్రాంతంలో లేదా వెళ్లిన కొత్త ప్రదేశంలో ఏటీఎం పనిచేయడం లేదా? క్యాష్ విత్​డ్రా చేయడం కష్టం అవుతోందా? అయితే ఈ వర్చువల్ ఏటీఎంతో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ లేకుండానే నగదు సులభంగా పొందొచ్చు. వర్చుల్ ఏటీఎం ద్వారా నగదు విత్​డ్రా చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్​ఫోన్​ సరిపోతుంది. మీరు కార్డ్​లెస్ నగదు తీసుకోవాలంటే మొదటగా పేమార్ట్​ బ్యాంకింగ్ యాప్​ను మీ మొబైల్​లో ఇన్​స్టాల్ చేసుకోవాలి.

Virtual ATM: OTP చెబితే చాలు.. డబ్బులిచ్చేస్తారు..

|

Updated on: Feb 15, 2024 | 4:29 PM

మీ ప్రాంతంలో లేదా వెళ్లిన కొత్త ప్రదేశంలో ఏటీఎం పనిచేయడం లేదా? క్యాష్ విత్​డ్రా చేయడం కష్టం అవుతోందా? అయితే ఈ వర్చువల్ ఏటీఎంతో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ లేకుండానే నగదు సులభంగా పొందొచ్చు. వర్చుల్ ఏటీఎం ద్వారా నగదు విత్​డ్రా చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్​ఫోన్​ సరిపోతుంది. మీరు కార్డ్​లెస్ నగదు తీసుకోవాలంటే మొదటగా పేమార్ట్​ బ్యాంకింగ్ యాప్​ను మీ మొబైల్​లో ఇన్​స్టాల్ చేసుకోవాలి. యాప్​ ద్వారా బ్యాంకుకు విత్​డ్రా రిక్వెస్ట్ చేయాలి. ఇది చేయాలంటే యూజర్​ మొబైల్​ నంబర్,​ బ్యాంక్ అకౌంట్​తో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ రిక్వెస్ట్​కు వినియోగదారుడి బ్యాంక్, ఒక ఓటీపీ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్​ను మీ సమీపంలోని దుకాణాల్లో చూపిస్తే, వారు నగదు ఇస్తారు. ఈ సేవలు అందించే దుకాణాల లిస్ట్​, లొకేషన్, ఫోన్​నంబర్ తదితర వివరాలు పేమార్ట్ యాప్​లో ఉంటాయి. మూరుమూల ప్రాంతాల్లో నివసించేవారు, అక్కడికి వెళ్లేవారికి ఈ సేవలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం పేమార్ట్​ కంపెనీ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తమ సేవలు అందిస్తోంది. అందులో చండీగఢ్, దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుర్రం దిగు… నడిచి వెళ్లు దళితునికి అగ్రవర్ణాల బెదిరింపులు

శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..

కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు

Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??

ఎక్సైజ్ సీఐ బదిలీ.. కన్నీటి పర్యంతమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ??

Follow us