శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..

శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..

Phani CH

|

Updated on: Feb 15, 2024 | 4:27 PM

విమానాలు, రైళ్లలో సప్లయ్‌ చేసే ఆహారంలో తరచూ క్రిములు, ఇనుప వస్తువులు కనిపించడం మనం చూసాం. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణికులకు సప్లయ్‌ చేసిన ఆహారంలో ఏకంగా ఇనుప స్క్రూ రావడంతో ఆ ప్రయాణికుడు ఖంగుతిన్నాడు. విమాన సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. తమకు సంబంధం లేదన్నారు. దాంతో అతను చేసేదిలేక తన గోడును సోషల్‌ మీడియాలో వెల్లబోసుకున్నాడు. ఫిబ్రవరి 1న ఓ వ్యక్తి ఇండిగో విమానంలో బెంగళూరునుంచి చెన్నైకి వెళ్తున్నాడు.

విమానాలు, రైళ్లలో సప్లయ్‌ చేసే ఆహారంలో తరచూ క్రిములు, ఇనుప వస్తువులు కనిపించడం మనం చూసాం. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణికులకు సప్లయ్‌ చేసిన ఆహారంలో ఏకంగా ఇనుప స్క్రూ రావడంతో ఆ ప్రయాణికుడు ఖంగుతిన్నాడు. విమాన సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. తమకు సంబంధం లేదన్నారు. దాంతో అతను చేసేదిలేక తన గోడును సోషల్‌ మీడియాలో వెల్లబోసుకున్నాడు. ఫిబ్రవరి 1న ఓ వ్యక్తి ఇండిగో విమానంలో బెంగళూరునుంచి చెన్నైకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతను విమానంలో శాండ్‌విచ్‌ ఆర్డర్‌ చేశాడు. విమాన సిబ్బంది అతనికి ఫుడ్‌ తీసుకొచ్చి ఇచ్చారు. కానీ అతను విమానంలో ఆ ఫుడ్ తినలేదు. విమానం దిగిన తర్వాత ఎయిర్‌పోర్టులో తిందామని ప్యాక్ ఓపెన్‌ చేశాడు. అందులో ఇనుప స్క్రూ ఉండటం గమనించి అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అయితే విమానం దిగిన తర్వాత ఫుడ్‌పై ఫిర్యాదు చేసేందుకు తనకు ఎలాంటి హక్కు లేదని ఎయిర్‌లైన్స్ సిబ్బంది అన్నట్టు వెల్లడించాడు. ఈ పరిస్థితుల్లో తాను ఏం చేయాలో చెప్పండంటూ నెటిజన్లను కోరాడు. ఫిబ్రవరి ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కంపెనీ సీఈఓకు నేరుగా ఫిర్యాదు చేయాలని కొందరు సలహా ఇచ్చారు. మరికొందరేమో లింక్డ్‌ఇన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని ఫిర్యాదులను పట్టించుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించాలని మరికొందరు సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు

Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??

ఎక్సైజ్ సీఐ బదిలీ.. కన్నీటి పర్యంతమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ??

ఈ రోజున అక్షరాలు దిద్దిస్తే.. అద్భుతాలు జరుగుతాయా ??

Medaram Jatara 2024: కోటి మంది వచ్చే జాతర.. కన్నుల పండువగా మొదలైంది