AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: చింత గింజలు చెత్తకాదు.. ముఖంపై నల్లమచ్చలకు దివ్యౌషధం..! ఇలా వాడితే చెమక్కు మనిపించే అందం..

Tamarind Seeds : ఆధునిక కాలంలో చర్మ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ముఖ్యంగా డార్క్ స్పాట్స్ తో ముఖ సౌందర్యం మసకబారుతోంది. డార్క్ పిగ్మెంట్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మంపై డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి. డార్క్ స్పాట్స్ సమస్యతో బాధపడేవారు మార్కెట్ లో లభించే మందులను వాడకూడదు. మీకు ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఈ నల్ల మచ్చలను చింతపండు గింజలతో సులభంగా తొలగించవచ్చు.

Jyothi Gadda
|

Updated on: Feb 18, 2024 | 12:44 PM

Share
Tamarind Seeds

Tamarind Seeds

1 / 5
చింత గింజల పౌడర్‌ చర్మానికి మంచి హైడ్రేషన్‌ ను అందిస్తుంది. ఈ గింజల్లో హైల్‌రోనిక్‌ యాసిడ్‌ నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చింతపండు ఫేస్ మాస్క్ టైరోసోనేస్ ఎంజైమ్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ క్రమంగా తగ్గుతాయి.

2 / 5
చింతపండును ఉపయోగించడం వల్ల చర్మ కణాలలో మంట కూడా తగ్గుతుంది. ఈ చింత గింజల్లో చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండచంలో సహాయపడుతుంది. 2012లో థాయ్ శాస్త్రవేత్తల అధ్యయనంలో, ఆరోగ్య నిపుణులు చింతపండు గింజలు నల్ల మచ్చలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

3 / 5
చింత గింజలను ఉపయోగించి ఫేస్‌ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీనికోసం చింత గింజల పొడి, బొప్పాయి రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అదేవిధంగా పొడి చర్మం ఉన్నవారు పాలతో.. జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి లేదా శనగ పిండితో చింత గింజల పొడిని కలిపి రాసుకోవాలి.

4 / 5
ఈ చింతగింజలను ఎండలో ఆరబెట్టి.. పొడిచేసి.. వీటిలో ఆలివ్‌ నూనెను వేసి కలిపి చర్మంపై పూస్తే.. మీ చర్మ రంగు మరింత పెరుగుతుంది. ఈ గింజలు మీకు సహజ మెరుపుతోపాటు వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. మొటిమలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. అన్ని రకాల స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది.

5 / 5