Char Dham Yatra: హిందూ మతంలో చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత, ఎన్ని రకాల చార్‌ధామ్‌ యాత్రలున్నాయంటే..

హిందూ మతానికి చెందిన ఈ ముఖ్యమైన చార్‌ధామ్‌లు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి,  యమునోత్రిలు ఉన్నాయి. హిందూ మతంలో రెండు రకాల చార్ ధామ్ యాత్రలు నిర్వహిస్తారు. ఒకటి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్ర .. మరొకటి బద్రీనాథ్, జగన్నాథ్, రామేశ్వర్, ద్వారకా ధామ్ యాత్ర. ఈ నాలుగు ధామ్‌లు చాలా పవిత్రమైనవి. ఈ ధామ్‌లను సందర్శించిన వ్యక్తుల అన్ని పాపాలు  తొలగి చివరికి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.

Char Dham Yatra: హిందూ మతంలో చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత, ఎన్ని రకాల చార్‌ధామ్‌ యాత్రలున్నాయంటే..
Char Dham Yatra 2024
Follow us
Surya Kala

|

Updated on: Feb 20, 2024 | 11:07 AM

హిందూ మతంలో చార్ ధామ్ యాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. విశ్వాసాల ప్రకారం..  నాలుగు ధామ్‌లను సందర్శించడం ద్వారా మోక్షాన్ని పొందుతాడు. ఈ కారణంగా హిందూ మతంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో చార్ ధామ్ యాత్రను సందర్శించాలని కోరుకుంటాడు. చార్ ధామ్ యాత్రకు సంబందించిన మతపరమైన ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ చార్ ధామ్ ఏవి?

హిందూ మతానికి చెందిన ఈ ముఖ్యమైన చార్‌ధామ్‌లు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి,  యమునోత్రిలు ఉన్నాయి. హిందూ మతంలో రెండు రకాల చార్ ధామ్ యాత్రలు నిర్వహిస్తారు. ఒకటి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్ర .. మరొకటి బద్రీనాథ్, జగన్నాథ్, రామేశ్వర్, ద్వారకా ధామ్ యాత్ర. ఈ నాలుగు ధామ్‌లు చాలా పవిత్రమైనవి. ఈ ధామ్‌లను సందర్శించిన వ్యక్తుల అన్ని పాపాలు  తొలగి చివరికి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.

చార్‌ధామ్‌ యాత్ర ప్రాముఖ్యత తెలుసా?

హిందూ మతంలో చార్‌ధామ్‌ యాత్రకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం చార్‌ధామ్‌ను సందర్శించడం ద్వారా వ్యక్తి  అన్ని పాపాలు నశిస్తాయి. వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. అటు వంటి వ్యక్తి మృత్యులోకంలో మళ్ళీ జన్మను పొందరని.. అతడు మోక్షాన్ని పొందుతాడు. శివపురాణం ప్రకారం ఎవరు కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించి పూజించిన తర్వాత ఆ నీటిని సేవిస్తారో వారు భూమిపై మళ్లీ జన్మించరు.

చార్ ధామ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

బద్రీనాథ్ క్షేత్రం విష్ణువుకు అంకితం చేయబడింది. ఇక్కడ విష్ణువు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు. బద్రీనాథ్ ను ఎనిమిదవ వైకుంఠంగా కూడా పిలుస్తారు. కేదార్‌నాథ్ ధామ్ శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుడు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు. కేదార్‌నాథ్ ధామ్‌లో రెండు పర్వతాలు ఉన్నాయి, వీటిని నర, నారాయణుడు అని పిలుస్తారు. కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించిన తర్వాత మాత్రమే బద్రీనాథ క్షేత్రాన్ని దర్శించాలని నియమం. ఇలా చేసినప్పుడు మాత్రమే  చార్ ధామ్ యాత్ర ప్రయోజనం అందుకుంటారని విశ్వాసం.

చార్ ధామ్‌ యాత్రకు సంబంధించిన భౌతిక ప్రాముఖ్యత

చార్ ధామ్‌కు వెళ్లే సమయంలో చాలా సేపు నడవాల్సి ఉంటుంది. దీంతో వ్యక్తి శరీరంలో శక్తి పెరిగి జీవితకాలం పెరుగుతుంది. అందువల్ల చార్ ధామ్‌ను సందర్శించిన వారికి ఆరోగ్యం, దీర్ఘాయువు,  ఆశీర్వాదం పొందుతారని, జీవితాంతం అనేక రకాల శారీరక సమస్యలకు దూరంగా ఉంటారని పురాణాల గ్రంధాలలో కూడా చెప్పబడింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు