AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: మేడారం జాతర ఎఫెక్ట్, సాధారణ ప్రయాణికులకు TSRTC అలర్ట్

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహా జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి.

TSRTC: మేడారం జాతర ఎఫెక్ట్, సాధారణ ప్రయాణికులకు TSRTC అలర్ట్
TSRTC
Balu Jajala
|

Updated on: Feb 20, 2024 | 10:15 AM

Share

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహా జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాయి.

కాగా రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను నడపుతోంది. అయితే జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నందున  రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అన్నారు. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్ చేసింది.  జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరింది.

అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతరకు సమాంతరంగా 24 చోట్ల సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోలివాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామం, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చిల్వ కుదూర్ గ్రామాల్లో జరిగే జాతరలకు భక్తులు భారీగా తరలివస్తారు.

ఈ జిల్లాల కలెక్టర్లు ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సురక్షితమైన తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. ఈ ఆలయాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి. ఆయా ఆలయాల చుట్టూ సీసీ రోడ్లు వేయడం, లైటింగ్ ఏర్పాట్లు చేయడం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ స్థలాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి