Ayodhya: బాల రామయ్య దర్శనం ఇక నుంచి మరింత సులువు.. సగం దర్శనం, హారతిని ముందుగా బుక్ చేసుకోవచ్చు..

సుగం దర్శనం లేదా హారతి సేవ కోసం భక్తులు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సేవలను ట్రస్ట్ పూర్తిగా భక్తులకు ఉచితంగా అందిస్తుంది. పాస్ లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ రెండిటి ద్వారా తీసుకోవచ్చు. 'సుగం దర్శన' పాస్ హోల్డర్లకు ప్రత్యేక క్యూ సిస్టమ్ ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నారు. 'సుగం దర్శనం' కోసం ప్రతి రెండు గంటల వ్యవధిలో ఆరు స్లాట్‌లున్నాయి. 

Ayodhya: బాల రామయ్య దర్శనం ఇక నుంచి మరింత సులువు.. సగం దర్శనం, హారతిని ముందుగా బుక్ చేసుకోవచ్చు..
Ayodhya Ram Mandir Darshan
Follow us

|

Updated on: Feb 20, 2024 | 10:42 AM

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి.. గర్భ గుడిలో బాల రామయ్య కొలువుదీరాడు. తమ ఆరాధ్య దైవం రామ్ లల్లాని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. దర్శనం కోసం క్యూల్లో బారులు  తీరుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం రామాలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. రామ్ లల్లా దర్శనాన్ని క్రమబద్ధీకరిస్తూ  రామాలయం ట్రస్ట్ శనివారం నుంచి ‘సుగం దర్శనం’ సౌకర్యాన్ని ప్రారంభించింది. అంతే కాదు బాల రామయ్య కు ఇచ్చే ఆరతిని దర్శించుకోవడనికి కూడా హారతి సేవ పాస్ లను ట్రస్ట్ పునఃప్రారంభించింది. ఈ సేవల ద్వారా భక్తులు రామయ్య దర్శనం కోసం క్యూలో ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు హారతి దర్శనం కోసం సేవ పాస్ ను తీసుకుని  ముందుగా వచ్చిన భక్తులు గర్భగుడిలో ఎక్కువ సమయం ఉండే అవకాశం లభిస్తుంది.

సుగం దర్శనం లేదా హారతి సేవ కోసం భక్తులు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సేవలను ట్రస్ట్ పూర్తిగా భక్తులకు ఉచితంగా అందిస్తుంది. పాస్ లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ రెండిటి ద్వారా తీసుకోవచ్చు. ‘సుగం దర్శన’ పాస్ హోల్డర్లకు ప్రత్యేక క్యూ సిస్టమ్ ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ‘సుగం దర్శనం’ కోసం ప్రతి రెండు గంటల వ్యవధిలో ఆరు స్లాట్‌లున్నాయి.

పాస్ హోల్డర్ల దర్శనం క్రమబద్ధీకరించేందుకు ఆలయ సముదాయంలో వాలంటీర్లను నియమించినట్లు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. కాలక్రమేణా సుగం దర్శనం కల్పిస్తూ ఎక్కువ మంది భక్తుల దర్శనాన్ని సులభతరం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రతి టైమ్ స్లాట్‌కు 300 పాస్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. రోజులో బాల రామయ్యకు ఇచ్చే మూడు హారతుల కోసం పాస్‌లను బుక్ చేసుకునే వ్యవస్థను రూపొందించినట్లు మిశ్రా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆరతి దర్శనం

బాల రామయ్య ఆరతి దర్శనం రోజుకు మూడుసార్లు ఇస్తారు. (ఉదయం 4 గంటలకు మంగళ హారతి, 6.15 గంటలకు శృంగార హారతి, రాత్రి 10 గంటలకు శయన హారతి) ప్రతి స్లాట్‌కు 100 పాస్‌లు జారీ చేస్తున్నారు.  ఇప్పటికే 15 రోజుల పాటు జరిగే హారతి కోసం భక్తులు బుకింగ్‌లు చేసుకున్నారు.

సుగం దర్శనం

సుగం దర్శనం రోజులో ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల మధ్య (ఉదయం 7-9, 9-11, 1-3, 3-5, సాయంత్రం 5-7, రాత్రి 7-9 వరకు) సాధ్యమవుతుంది. వృద్ధులు, దివ్యంగులు ఆలయ సముదాయం సమీపంలోని ట్రస్ట్ కార్యాలయంలో పాస్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌ల కోసం ట్రస్ట్ స్పెషల్ కోటాను ఏర్పాటు చేసింది. పాస్ సేవను పొందాలనుకున్న భక్తులు స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం  ఫోటో గుర్తింపు కార్డును అందించాలి. బాల రామయ్య సందర్శన సమయంలో IDని తీసుకెళ్లాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..