AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion History: 5 వేల ఏళ్ల చరిత్ర.కలిగిన ఉల్లి మనదేశానికి ఎలా వచ్చింది. ఆ దేశంలో దేవుడి ఆరాధనలో వినియోగం

ఎక్కువ కాలం ఉంచితే చెడిపోని వాటిలో ఉల్లి ఒకటి. ఆహారానికి రుచిని అందించడమే కాదు.. దీనిలో అనేక  ప్రత్యేకతఉన్నాయి. ఈ కారణంగానే అత్యధికంగా ఎగుమతి అయ్యే ఆహార పదార్థాల్లో ఉల్లి చోటు చేసుకుంది. దాని అవసరాన్ని అర్థం చేసుకుని, ఇతర దేశాలలో ఉల్లి సాగు క్రమంగా ప్రారంభమైంది. ఉల్లి పరిధి పెరిగింది. అనేక వ్యాధుల నుండి మానవులకు ప్రత్యక్షంగా ఉపశమనాన్ని అందించే చరక్ సంహితలో దీని  ప్రయోజనాలు కూడా వివరించబడ్డాయి.

Onion History: 5 వేల ఏళ్ల చరిత్ర.కలిగిన ఉల్లి మనదేశానికి ఎలా వచ్చింది. ఆ దేశంలో దేవుడి ఆరాధనలో వినియోగం
Raw Onion
Surya Kala
|

Updated on: Feb 20, 2024 | 9:58 AM

Share

తనని కట్ చేస్తే మనుషులను ఏడిపించి కన్నీరు పెట్టించడమే కాదు.. ధరలతో ఏకంగా ప్రభుత్వాలను మార్చేసే శక్తిని సొంతం చేసుకుంది  ఉల్లి. అయితే ఈ ఉల్లిపాయను 4 వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉల్లి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో పండించే పంట.. అయినప్పటికీ దీని ధరలు రికార్డ్ సృష్టిస్తూ ఉంటాయి. ఉల్లి ఉత్పత్తిలో భారతదేశం, చైనాలు ముందంజలో ఉన్నాయి. అయితే ఉల్లిపాయలను ఎక్కువగా వినియోగించే దేశాలలో భారతదేశం, చైనాలు రెండూ లేవు. ఉల్లి మరోసారి వార్తల్లోకి నిలిచింది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఉల్లిపాయల ఎగుమతికి ఆమోదం తెలిపింది. దేశంలో ఉల్లి ధరలు భారీగా పతనం ఐయ్యాయి. దీంతో ఉల్లి రైతుకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తరచుగా ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. అయితే ఈసారి ఉల్లి ధర రికార్డ్ స్థాయిలో లేదు. ఆహారంలో ఉల్లి  వినియోగం పెరిగితే దానికి ఉన్న  డిమాండ్‌ను పెంచుతుంది. ధరలను పెంచుతుంది.

ఉల్లిపాయ ఎక్కడ నుండి వచ్చింది?

ఆహార చరిత్ర, మొక్కలపై అవగాహన ఉన్న నిపుణులు ఉల్లిపాయలు మధ్య ఆసియాలో ఉద్భవించాయని నమ్ముతున్నట్లు నేషనల్ ఆనియన్ అసోసియేషన్ పేర్కొంది. కొన్ని అధ్యయనాల్లో ఉల్లిని మొదట ఇరాన్ ,  పశ్చిమ పాకిస్తాన్‌లలో పండించారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పూర్వీకులు చాలా కాలం క్రితం అడవి ఉల్లిపాయను కనుగొన్నారని… దానిని వండకముందే తినడం ప్రారంభించారని నమ్ముతారు. చరిత్రపూర్వ కాలంలో ఉల్లిపాయలు ఆహారంలో ప్రధాన భాగంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉల్లిపాయలు 5000 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుండి సాగు చేయబడుతున్నాయని చాలా మంది పరిశోధకులు అంగీకరిస్తున్నారు. ఉల్లి వివిధ ప్రాంతాలలో అడవి మొక్కగా పెరిగింది.

ఎక్కువ కాలం ఉంచితే చెడిపోని వాటిలో ఉల్లి ఒకటి. ఆహారానికి రుచిని అందించడమే కాదు.. దీనిలో అనేక  ప్రత్యేకతఉన్నాయి. ఈ కారణంగానే అత్యధికంగా ఎగుమతి అయ్యే ఆహార పదార్థాల్లో ఉల్లి చోటు చేసుకుంది. దాని అవసరాన్ని అర్థం చేసుకుని, ఇతర దేశాలలో ఉల్లి సాగు క్రమంగా ప్రారంభమైంది. ఉల్లి పరిధి పెరిగింది. అనేక వ్యాధుల నుండి మానవులకు ప్రత్యక్షంగా ఉపశమనాన్ని అందించే చరక్ సంహితలో దీని  ప్రయోజనాలు కూడా వివరించబడ్డాయి.

ఈజిప్టులో దేవుని ఆరాధనకు చిహ్నంగా ఉల్లి

ఈజిప్టులో ఉల్లికి సంబంధించి వివిధ ఆచారాలు ఉన్నాయి. పురాతన ఈజిప్టులో, ఉల్లిపాయను దేవుని ఆరాధనలో భాగంగా పరిగణించేవారు. దీని నిర్మాణం మానవ జీవితం లాంటిదని ఈజిప్షియన్లు నమ్ముతారు. దాని పొరలు ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోయినట్లే, మానవ జీవితం కూడా అలాంటిదే. అందుకే మనుషులను పాతిపెట్టేటప్పుడు ఉల్లిపాయలు ఉంచే సంప్రదాయం ఉంది. మమ్మీతో ఉల్లిపాయలు దొరికాయని చాలాసార్లు ధృవీకరించబడింది. ఉల్లిపాయలు అంత్యక్రియల సమర్పణలుగా పేర్కొనబడ్డాయి.పెద్ద వేడుకల చిత్రాలలో చిత్రీకరించబడ్డాయి. ఇది మానవ జీవిత శాశ్వతత్వానికి చిహ్నంగా కూడా పరిగణించబడింది.

దేశంలో- ప్రపంచంలో ఉల్లి పరిస్థితి?

ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలోని 175 దేశాలు ఉల్లిని పండిస్తున్నాయి. గోధుమలను ఉత్పత్తి చేసే దేశాలతో పోలిస్తే ఉల్లిని పండించే దేశాల సంఖ్య దాదాపు రెట్టింపు. ఇది ఆహారంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కనుక చాలా దేశాలు దీనిని ప్రపంచం అంతా ఉపయోగించే  ఏకైక ఆహార పదార్థంగా పరిగణిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఉల్లిని పండించే దేశాల్లోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారత్, చైనా, అమెరికా, ఈజిప్ట్, టర్కీ, పాకిస్థాన్ దేశాలు ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో, ఉల్లిని ఎక్కువగా వినియోగించే దేశం తజికిస్థాన్. ఇక్కడ ఒక్కొక్కరికి 60 కిలోల ఉల్లి వినియోగిస్తున్నారు. దీని తరువాత నైజర్ మరియు సూడాన్ ఉన్నాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..