Bhishma Ekadashi: నేడు భీష్మ ఏకాదశి చేయాల్సిన దానాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం వలన కలిగే ఫలితం ఏమిటంటే..

హిందూమతంలో భీష్మ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వాసాల ప్రకారం. ఎవరైతే భీష్మ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో..  కథను వింటారో.. అతని జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అంతే కాకుండా మరణం తరువాత మోక్షాన్ని పొందుతారని.. విముక్తి పొందుతారని నమ్ముతారు. అందుకే జయ ఏకాదశిని మోక్షానికి ద్వారం అని కూడా అంటారు. జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా శ్రీ  విష్ణువు, లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతాడు.

Bhishma Ekadashi: నేడు భీష్మ ఏకాదశి చేయాల్సిన దానాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం వలన కలిగే ఫలితం ఏమిటంటే..
Bhishma Ekadasi
Follow us

|

Updated on: Feb 20, 2024 | 6:49 AM

హిందూ మతంలో ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఏకాదశి రోజున ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశుల్లో భీష్మ ఏకాదశికి (జయ ఏకాదశికి) చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని  జయ ఏకాదశిని అని కూడా అంటారు. ఉత్తరాయణ కాలంలో ప్రాణాలు విడిచిన వ్యక్తి భీష్ముడు.

భీష్మ ఏకాదశి మతపరమైన ప్రాముఖ్యత తెలుసా?

హిందూమతంలో భీష్మ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వాసాల ప్రకారం. ఎవరైతే భీష్మ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో..  కథను వింటారో.. అతని జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అంతే కాకుండా మరణం తరువాత మోక్షాన్ని పొందుతారని.. విముక్తి పొందుతారని నమ్ముతారు. అందుకే జయ ఏకాదశిని మోక్షానికి ద్వారం అని కూడా అంటారు. జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా శ్రీ  విష్ణువు, లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతాడు. జీవితం సిరి,  సంపదలతో నిండి ఉంటుంది. నమ్మకం ప్రకారం జయ ఏకాదశి వ్రతం సమయంలో కథ వినాలి. ఉపవాసం లేని ఏకాదశి అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

వ్యాసుడు మహా భారతాన్ని అందించినా.. భీష్ముడే భారతంలో ప్రధాన పాత్ర. తండ్రి కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. ఇచ్చామరణం వరం పొందిన భీష్ముడు పాండవ, కౌరవ మహా సంగ్రామంలో మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్న భీష్ముడు.. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ మరణం కోసం వేచి ఉన్నాడు. ఉత్తరాయణం కాలం ప్రవేశించిన అనంతరం అష్టమి రోజున కృష్ణ పరమాత్ముడిని ఐక్యం చేసుకోమంటూ వేడుకున్నాడు.  కురువృద్ధుడు తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. కృష్ణుడిని స్తుతిస్తూ.. విష్ణు సహస్ర నామాన్నిలోకానికి అందించారు.

ఇవి కూడా చదవండి

భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాలు

  1. దశమి రోజున రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం చేసి ఏకాదశి రాత్రివేళ జాగరణ చేస్తారు. ఏకాదశి రోజున చేసే విష్ణు పూజకు ప్రాధాన్యం ఉంది. ఈ రోజున విష్ణుసహస్రనామాలను జపించడం వలన విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుస్తారు.
  2. ఈ రోజున భీష్ముడుకి తర్పణాలను విడుస్తారు. ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే  తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దల నమ్మకం.
  3. ఈ రోజున బ్రాహ్మణులకు గొడుగు చెప్పులు,  వస్త్రాలు దానం చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది. .
  4. భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ విష్ణుసహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ, భీష్ముని తల్చుకుంటే మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు