Vemulawada: మేడారం జాతర ఎఫెక్ట్.. రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు.. భారీగా హుండీ ఆదాయం..
మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకుని పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయం భక్తులతో సందడి నెలకొంది. నేపథ్యంలో వేములవాడ రాజన్నకు గత 13 రోజులకు గాను భారీగా ఆదాయం లభించింది

తెలంగాణాలో ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ. ఇక్కడ శివయ్య శ్రీరాజరాజేశ్వర స్వామి వారీగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకుని పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయం భక్తులతో సందడి నెలకొంది
ఈ నేపథ్యంలో వేములవాడ రాజన్నకు గత 13 రోజులకు గాను భారీగా ఆదాయం లభించింది. ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ చెప్పారు. హుండీ ఆదాయం లెక్కింపు కర్యక్రమంలో రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హుండీ ఆదాయం గత 13 రోజులకు గాను 1,77,74,752 రూపాయలు వచ్చింది. మేడారం జాతర నేపథ్యంలో రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరిగిందని ఆలయాధికారులు చెబుతున్నారు.
స్వామివారికి బంగారం 283 గ్రా.100. మి.గ్రా. రాగా వెండి సుమారు 11 కిలోలు భక్తులు కానుకల రూపంలో చెల్లించినట్లు తెలిపారు.
హుండీ ఆదాయాన్ని లెక్కింపు సమయంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కెమెరాల నిఘా నీడలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఎవరైనా ఆసక్తి గల భక్తులు స్వామివారి కానుకల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనాలంటే.. పది రోజుల ముందుగా ఆలయ అధికారుకు ప్రభుత్వ గుర్తింపు కార్డుని అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
రాజన్నదర్శనం చేసుకునే ముందు భక్తులు మొదట ఆలయంలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తలనీలను సమర్పిస్తున్నారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. స్వామి ఆలయంలో ఉన్న ధర్మగుండంలో పుణ్య స్నానం ఆచరిస్తే సమస్త దోషాలు, రోగాలు తొలగిపోయాని భక్తుల విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..