AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Constable Training: కానిస్టేబుళ్ల శిక్షణకు 30 శాతం అభ్యర్ధులు డుమ్మా..! తలలు పట్టుకున్న పోలీస్ శాఖ

తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన వారికి బుధవారం (ఫిబ్రవరి 21) పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణ ప్రారంభమైంది. అయితే తొలిరోజు భారీగా శిక్షణార్థులు గైర్హాజరవడం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. తొలిరోజు సుమారు 2,833 మంది హాజరుకాలేదు. దీంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. కానిస్టేబుల్ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 13,953 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరిలో తొలి దశలో..

TS Constable Training: కానిస్టేబుళ్ల శిక్షణకు 30 శాతం అభ్యర్ధులు డుమ్మా..! తలలు పట్టుకున్న పోలీస్ శాఖ
TS Constable Training
Srilakshmi C
|

Updated on: Feb 22, 2024 | 1:30 PM

Share

హైదరాబాద్‌, పిబ్రవరి 22: తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన వారికి బుధవారం (ఫిబ్రవరి 21) పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణ ప్రారంభమైంది. అయితే తొలిరోజు భారీగా శిక్షణార్థులు గైర్హాజరవడం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. తొలిరోజు సుమారు 2,833 మంది హాజరుకాలేదు. దీంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. కానిస్టేబుల్ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 13,953 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరిలో తొలి దశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లు, పీటీసీలు, సీటీసీలు వంటి తదితర 28 కేంద్రాల్లో శిక్షణను బుధవారం ప్రారంభించారు. శిక్షణ తొలిరోజు దాదాపు 6,500 మంది మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌ అంబర్‌పేట పోలీస్‌ శిక్షణ కళాశాల(పీటీసీ)లో 650 మందికిగానూ 482 మంది మాత్రమే వచ్చారు. ఇక మేడ్చల్‌ పీటీసీలో 509కి 422 మంది, కరీంనగర్‌ పీటీసీలో 1000కి 675 మంది, వరంగల్‌ నగర శిక్షణ కేంద్రం (సీటీసీ)లో 250కి 201మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు అన్ని కేంద్రాల్లో ఏ ఒక్కచోట పూర్తి అటెండెన్స్‌ కనిపించలేదు. మొత్తంగా సుమారు 30 శాతం మంది హాజరుకానట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కారణాలను అన్వేషించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయులు, స్టాఫ్‌నర్స్‌ల పోస్టులు దక్కించుకున్నందునే పలువురు శిక్షణకు గైర్హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. హాజరుకాని అభ్యర్ధుల్లో మహిళా కానిస్టేబుల్‌ అభ్యర్ధులే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు హాజరు కాలేదని సమాచారం. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని పోలీస్‌ నియామక మండలి ఆలోచనలో పడింది.

భారీగా బ్యాక్‌లాగ్‌లు పెరిగే అవకాశం

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో 4,965 సివిల్‌, 4,423 ఏఆర్‌, 100 ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, 5,010 టీఎస్‌ఎస్‌పీ, 262 ఐటీ అండ్‌ సీ, 121 పీటీవో కానిస్టేబుళ్ల భర్తీకి 2022లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారంగా అన్ని విభాగాల్లో కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి. కానీ నియామక ప్రక్రియలో తగినంత మంది అర్హత సాధించలేకపోయారు. దీనితో 13,953 మందిని మాత్రమే ఎంపిక చేశారు. దీంతో 928 పోస్టులు బ్యాక్‌లాగ్‌ కింద మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు శిక్షణకూ పెద్ద సంఖ్యలో గైర్హాజరవడంతో బ్యాక్‌లాగ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిక్షణలో చేరేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తామని, ఆ లోపు చేరిన వారిని మాత్రమే శిక్షణకు తీసుకుంటామని, మిగిలి పోయిన పోస్టులను బ్యాక్‌లాగ్‌లో చేర్చుతామని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.