Jackpot : దెబ్బకు దరిద్రం వదిలిపోయింది.. లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెల్చుకున్న యువకుడు!

చైనా వెల్ఫేర్‌ లాటరీలో ఓ యువ వ్యాపారికి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.795 కోట్లు లాటరీలో గెల్చుకుని రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడు. ఇప్పటి వరచు చైనా దేశంలోనే అతిపెద్ద జాక్‌పాట్‌ ఇదేనట. వివరాల్లోకెళ్తే.. నైరుతి చైనాలోని గుయిఝౌ ప్రావిన్స్‌కు చెందిన 28 యేళ్ల చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఒక్కక్కటి రెండు యువాన్లు (25 సెంట్లు) చొప్పున కొనుగోలు చేశాడు. ప్రతిసారీ ఒకే గ్రూపునకు చెందిన ఏడు నంబర్లపై..

Jackpot : దెబ్బకు దరిద్రం వదిలిపోయింది.. లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెల్చుకున్న యువకుడు!
Lottery Jackpot
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 22, 2024 | 10:59 AM

బీజింగ్‌, ఫిబ్రవరి 22: చైనా వెల్ఫేర్‌ లాటరీలో ఓ యువ వ్యాపారికి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.795 కోట్లు లాటరీలో గెల్చుకుని రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడు. ఇప్పటి వరచు చైనా దేశంలోనే అతిపెద్ద జాక్‌పాట్‌ ఇదేనట. వివరాల్లోకెళ్తే.. నైరుతి చైనాలోని గుయిఝౌ ప్రావిన్స్‌కు చెందిన 28 యేళ్ల చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఒక్కక్కటి రెండు యువాన్లు (25 సెంట్లు) చొప్పున కొనుగోలు చేశాడు. ప్రతిసారీ ఒకే గ్రూపునకు చెందిన ఏడు నంబర్లపై పందెం కాసేవారని, ప్రతి టికెట్‌కు దాదాపు రూ.6 కోట్ల చొప్పున బహుమతి వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్‌సైట్ ప్రకారం.. గుయిజౌ ప్రావిన్స్‌కు చెందిన లాటరీలో రూ.795.84 కోట్లు (680 మిలియన్‌ డాలర్లు) గెల్చుకున్నట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మంగళవారం నివేదించింది. అయితే విజేత వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు. గుర్తుతెలియని ఆ వ్యక్తి ఈ నెల 7వ తేదీన బహుమతి స్వీకరించేందుకు వచ్చినట్లు ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి తెలిపారు. విజేత స్పందిస్తూ.. తనకు ఉద్వేగభరితుడినయ్యానని, నిద్ర పట్టలేదని చెప్పారు. మొదట తాను నమ్మలేదని, అది నిజమో కాదో తెలుసుకోవడానికి పలుమార్లు ధృవీకరించుకోవల్సి వచ్చిందన్నారు. చైనాలోని వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం బహుమతిలో ఐదో వంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

అన్షున్ నగరంలో నివసిస్తోన్న ఈ చిరు వ్యాపారి ఆ మరుసటి రోజు తెల్లవారుజామున తాను బహుమతిగా గెలుచుకున్న చెక్కును సేకరించేందుకు గుయిజౌ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. గతంలో గెలిచిన టిక్కెట్‌లలో కనిపించే సంఖ్యల ధోరణిని పరిశీలిస్తున్నానని, అయితే వాటిలో కొన్నింటిని మాత్రమే ఎంచుకున్నానని అన్నాడు. పందెం వేయడానికి తన లక్కి నెంబర్‌ను ఉపయోగించినట్లు అతను చెప్పాడు. చాలా కాలంగా ఈ విధంగా పందెం వేస్తున్నట్లు తెలిపాడు. స్ప్రింగ్ ఫెస్టివల్ హాలిడే సందర్భంగా ఈ శుభవార్తను తన కుటుంబ సభ్యులతో పంచుకుంటానని సంతోషం వ్యక్తం చేశాడు.

కాగా చైనాలో ఇలా భారీ మొత్తంలో జాక్‌ఫాట్‌లు తగడం ఇదేం తొలిసారి కాదు. 2012లో బీజింగ్‌కు చెందని ఓ వ్యక్తి 570 మిలియన్‌ యువాన్లు లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. గత యేడాది డిసెంబర్‌లో తూర్పు జియాంగ్జి ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి లక్ష యువాన్‌లతో లాటరీ టిక్కెట్‌లను కొనుగోలు చేసి 200 మిలియన్ యువాన్‌ల బహుమతిని కైవసం చేసుకున్నాడు. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో నివసిస్తున్న మరోవ్యక్తి 2022లో 218 మిలియన్ యువాన్ (USD 40 మిలియన్లు) గెలుచుకుని పలు విమర్శలకు గురయ్యాడు. తాను లాటరీ గెల్చుకున్న విషయాన్ని తన భార్య, పిల్లలకు చెప్పకూడదని నిర్ణయింకున్నానని, ఒకవేళ వారికి చెబితే వారు గర్వంతో కష్టపడి పనిచేయడం మానేస్తారని అన్నాడు. దీంతో పలువురు అతగాడి అతి తెలివితేటలు చూసి తిట్టిపోశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.