AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Whisky: అలా ఉంటది మనతోని.. ప్రపంచానికే కిక్కిస్తున్న ఇండియన్ విస్కీ.. తెగ తాగేస్తున్న ఫారెనర్స్

Indian single malt whisky : ఫారిన్ లిక్కర్ తాగితే ఆ కిక్కే వేరప్ప.. అనుకుంటారు మన ఇండియన్స్.. ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే ఒక్క లిక్కర్ బాటిల్ తీసుకురమ్మని అడిగేవాళ్లు చాలామందే ఉంటారు. ఫారిన్ లిక్కర్ అంటే అంత క్రేజ్ ఇక్కడ. కానీ ఇప్పుడు సీన్ మారింది. మన సీమ సరుకుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. ఫారిన్ కంట్రీస్‌లో ఫారిన్ లిక్కర్ అని..

Indian Whisky: అలా ఉంటది మనతోని.. ప్రపంచానికే కిక్కిస్తున్న ఇండియన్ విస్కీ.. తెగ తాగేస్తున్న ఫారెనర్స్
Whisky
Rakesh Reddy Ch
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 22, 2024 | 1:53 PM

Share

Indian single malt whisky : ఫారిన్ లిక్కర్ తాగితే ఆ కిక్కే వేరప్ప.. అనుకుంటారు మన ఇండియన్స్.. ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే ఒక్క లిక్కర్ బాటిల్ తీసుకురమ్మని అడిగేవాళ్లు చాలామందే ఉంటారు. ఫారిన్ లిక్కర్ అంటే అంత క్రేజ్ ఇక్కడ. కానీ ఇప్పుడు సీన్ మారింది. మన సీమ సరుకుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. ఫారిన్ కంట్రీస్‌లో ఫారిన్ లిక్కర్ అని.. ఇండియన్ విస్కీని యమ తాగేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్కౌట్ ల్యాండ్ విస్కీ చాలా ఫేమస్. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని విస్కీ బ్రాండ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ విస్కీ బ్రాండ్స్‌లో ఇండియన్ బ్రాండ్ చోటు సంపాదించుకుంటుంది. ఈ ట్రెండ్ బెంగళూరుకు చెందిన అమృత్ బ్రాండ్ తో మొదలైంది. అమృత్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన సింగిల్ మాల్ట్ విస్కీ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటింది. గత ఐదేళ్లుగా టాప్ టెన్ విస్కీ బాటిల్స్ లో ఒకటిగా అమృత్ వెలుగుతోంది. ఇక తర్వాత కురింజి.. ఇది కూడా అమృత్ కంపెనీ నుంచే తయారైన మరో రకం విస్కీ. ఇది కూడా టాప్ టెన్ విస్కీ బ్రాండ్స్ లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.

Wiskey

Wiskey

ఇక లేటెస్ట్ గా ఇంద్రి వరల్డ్ విస్కీ మార్కెట్ ను కిక్కెక్కిస్తుంది. హర్యానాలో తయారవుతున్న ఇంద్రి సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్ ఎయిర్పోర్టులో అత్యధిక సేల్స్ సాధించింది. దాదాపుగా అన్ని డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్టు స్టోర్స్ లో ఇండియన్ లిక్కర్ కి డిమాండ్ పెరుగుతుంది. దీంతోపాటు కొన్ని ఇండియన్ బ్రాండ్స్ వోడ్కా బాటిల్స్ కూడా ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఇక కింగ్ ఫిషర్ బీర్ ఏ దేశం వెళ్లిన లభించే పరిస్థితిలో ఉంది. అంతేకాదు అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో చాలామందికి కింగ్ ఫిషర్ ఫేవరెట్ బీర్ కూడా… ఇక మద్యం ప్రియులు నాణ్యమైన లిక్కర్ కోసం విదేశాల నుంచి వచ్చే వారిపై ఆధారపడాల్సిన అవసరం లేదు.. దేశంలోనే మంచి క్వాలిటీ లిక్కర్ తయారవుతుందంటూ మందు బాబులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..