AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మార్కులు తక్కువొచ్చాయని విద్యార్ధులను చితకబాదిన ఉపాధ్యాయుడు.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

మార్కులు తక్కువగా వచ్చాయని పదో తరగతి విద్యార్థులను పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో విద్యార్ధుల వీపులపై వాతలు తేలాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. మాదిరిపురం గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో..

Telangana: మార్కులు తక్కువొచ్చాయని విద్యార్ధులను చితకబాదిన ఉపాధ్యాయుడు.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
Teacher Beats Students For Low Marks
Srilakshmi C
|

Updated on: Feb 21, 2024 | 7:05 AM

Share

తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 21: మార్కులు తక్కువగా వచ్చాయని పదో తరగతి విద్యార్థులను పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో విద్యార్ధుల వీపులపై వాతలు తేలాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. మాదిరిపురం గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతిలో 62 మంది విద్యార్థులున్నారు. పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పదో తరగతి విద్యార్ధులకు తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌రావు ఇటీవల గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించారు.

ఈ పరీక్షలో కొందరు విద్యార్ధులకు తక్కువ మార్కులు వచ్చాయి. దాదాపు 25 మంది విద్యార్థులను బ్లాక్‌బోర్డు తుడిచే డస్టర్‌తో మంగళవారం రాత్రి కొట్టారు. దీంతో విద్యార్ధుల వీపులు ఎర్రగా కమిలిపోయాయి. ఈ విషయమై కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్‌లో ఉపాధ్యాయుడు కొట్టిన సంగతి తెలిపారు. గురుకులానికి సమీపంలో ఉన్న చంద్రుతండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఉపాధ్యాయుణ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గిరిధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించినట్లు మీడియాకు తెలిపారు.

హిమాయత్‌నగర్‌: చిన్నారిని భయపెట్టిన ఘటనలో వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష

చిన్నారిని భయపెడుతున్న ఓ వ్యక్తికి నాంపల్లి కోర్టు 2 రోజులు జైలు శిక్ష విధించింది. కోఠి ఇసామియా బజార్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి బషీర్‌బాగ్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుకుంటుంది. అయితే హిమాయత్‌నగర్‌ వీధి నం1లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏ సురేశ్‌(41) అదే స్కూల్‌లో పిల్లలను ఆటోలో తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో చిన్నారిని భయపెట్టసాగాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించి సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు సురేశ్‌ను మంగళవారం నాంపల్లికోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి సత్యనారాయణ అతనికి 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై నరేశ్‌ కుమార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?