TSPSC Group 1 Notification 2024: పాత నోటిఫికేషన్‌ రద్దు.. 503 పోస్టులతో టీఎస్‌స్పీయస్సీ గ్రూప్‌ -1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల! పోస్టుల వివరాలివే..

తెలంగాణలో గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్‌ సోమవారం (ఫిబ్రవరి 19) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 2022 ఏప్రిల్‌లో గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది గ్రూప్‌ 1తో సహా వరుస పేపర్‌ లీకేజీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. ఈ కారణంగా ఒకసారి..

TSPSC Group 1 Notification 2024: పాత నోటిఫికేషన్‌ రద్దు.. 503 పోస్టులతో టీఎస్‌స్పీయస్సీ గ్రూప్‌ -1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల! పోస్టుల వివరాలివే..
TSPSC Group 1 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 20, 2024 | 7:25 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: తెలంగాణలో గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్‌ సోమవారం (ఫిబ్రవరి 19) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 2022 ఏప్రిల్‌లో గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది గ్రూప్‌ 1తో సహా వరుస పేపర్‌ లీకేజీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. ఈ కారణంగా ఒకసారి గ్రూప్‌ 1 పరీక్ష రద్దుకాగా.. మరొకమారు నిబంధనలు సరిగా పాటించలేదని ప్రిలిమ్స్‌ పరీక్షను కోర్టు రద్దు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో మరో 60 పోస్టులను గ్రూప్‌ 1 పోస్టులకు అదనంగా చేర్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ పూర్తిగా రద్దు చేసింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. మొత్తం పోస్టులతో కలిపి అంటే 563 పోస్టులకు గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి కమిషన్‌ కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇక ఇప్పటికే గ్రూప్‌ 1 పోస్టులకు సర్కార్ వయోపరిమితి పెంచింది కూడా. ఆ లెక్కన ఏయే కేటగిరీలకు ఏ విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుందో.. విభాగాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో.. ఆ వివరాలు మీ కోసం..

పోస్టుల వివరాలు..

  • డీఎస్పీ పోస్టుల సంఖ్య: 115
  • సీటీవో పోస్టుల సంఖ్య: 48
  • ఆర్టీవో పోస్టుల సంఖ్య: 4
  • జిల్లా పంచాయతీ అధికారి పోస్టుల సంఖ్య: 7
  • జైళ్ల శాఖలో డీఎస్పీ పోస్టుల సంఖ్య: 5
  • సహాయ కార్మిక అధికారి పోస్టుల సంఖ్య: 8
  • అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 30
  • గ్రేడ్‌ -2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టుల సంఖ్య: 41
  • సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/జిల్లా అధికారులు పోస్టుల సంఖ్య: 3
  • జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టుల సంఖ్య: 5
  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టుల సంఖ్య: 2
  • జిల్లా ఉపాధి కల్పన అధికారి పోస్టుల సంఖ్య: 5
  • ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 20
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 38
  • అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 41
  • ఎంపీడీవో పోస్టుల సంఖ్య: 140

జులై 1, 2024 నాటికి వయో పరిమితి సడలింపులు ఇలా..

  • డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు 18 నుంచి 46 ఏళ్లు
  • డీఎస్పీ పోస్టులకు 21 – 35 ఏళ్లు
  • సీటీవో పోస్టులకు 18 – 46ఏళ్లు
  • ఆర్టీవో పోస్టులకు 21 – 46 ఏళ్లు
  • జిల్లా పంచాయతీ అధికారి పోస్టులకు 18 – 46 ఏళ్లు
  • జైళ్ల శాఖలో డీఎస్పీ పోస్టులకు 18 – 35 ఏళ్లు
  • సహాయ కార్మిక అధికారి పోస్టులకు 18 – 46 ఏళ్లు
  • అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు 21 – 35 ఏళ్లు
  • గ్రేడ్‌ -2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులకు18 – 46 ఏళ్లు
  • సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/జిల్లా అధికారులు పోస్టులకు18 – 46 ఏళ్లు
  • జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులకు18 – 46 ఏళ్లు
  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులకు18 – 46 ఏళ్లు
  • జిల్లా ఉపాధి కల్పన అధికారి పోస్టులకు18 – 46 ఏళ్లు
  • ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ పోస్టులకు 18 – 46 ఏళ్లు
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టులకు 18 – 46 ఏళ్లు
  • అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌ పోస్టులకు 18 – 46 ఏళ్లు
  • ఎంపీడీవో పోస్టులకు 18 – 46 ఏళ్లు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.