Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Sleeping Pills: ఎగ్జామ్‌ టైంలో నిద్రపట్టకుండా ఉండేందుకు ‘యాంటీ స్లీప్ పిల్స్’ వేసుకుంటున్నారా? వైద్యుల హెచ్చరిక ఇదే

ప్రస్తుతం విద్యార్ధులందరూ పరీక్షల ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిద్రను దూరం చేసేందుకు కొందరు విద్యార్ధులు కప్పు మీద కప్పు కాఫీ తాగుతుంటారు. అయితే మరికొంత మంది మాత్రం నిద్రను నివారించడానికి 'యాంటీ స్లీప్ పిల్స్' కూడా వేసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రను నివారించడానికి వేసుకునే 'యాంటీ స్లీప్ పిల్స్' ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు...

Anti Sleeping Pills: ఎగ్జామ్‌ టైంలో నిద్రపట్టకుండా ఉండేందుకు 'యాంటీ స్లీప్ పిల్స్' వేసుకుంటున్నారా? వైద్యుల హెచ్చరిక ఇదే
Anti Sleeping Pills
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 21, 2024 | 1:10 PM

ప్రస్తుతం విద్యార్ధులందరూ పరీక్షల ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిద్రను దూరం చేసేందుకు కొందరు విద్యార్ధులు కప్పు మీద కప్పు కాఫీ తాగుతుంటారు. అయితే మరికొంత మంది మాత్రం నిద్రను నివారించడానికి ‘యాంటీ స్లీప్ పిల్స్’ కూడా వేసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రను నివారించడానికి వేసుకునే ‘యాంటీ స్లీప్ పిల్స్’ ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తరచూ నిద్ర నిరోధక మాత్రలు వేసుకుంటున్నాడు. ఓవర్ డోస్ వల్ల అతని మెదడులో రక్తం గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమించితే ప్రాణాలు కూడా పోతాయి. యాంటీ స్లీప్ పిల్స్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్లీప్ సైన్స్’ అధినేత సోమనాథ్ మైతీతో మాటల్లో మీకోసం..

వైద్యుల సలహా లేకుండా నిద్ర నిరోధక మాత్రలు తీసుకోకూడదు. సాధారణంగా ఈ రకమైన ఔషధం నిద్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్యులు ఇస్తుంటారు. వీరు ఉదయాన్నే నిద్ర నిరోధక మాత్రలు తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి ఉదయం కాకుండా రాత్రి సమయంలో మాత్రమే నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ‘యాంటీ స్లీప్ పిల్స్’ ఔషధ మొడఫినిల్‌కి చెందిన వివిధ రూపాలు. ఇవి ప్రధానంగా నార్కోలెప్సీ, షిఫ్ట్ వర్క్ స్లీప్ డిజార్డర్ వంటి రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రకమైన యాంటీ స్లీపింగ్ మాత్రలు 40 గంటలకు పైగా మేల్కొని ఉండేలా చేస్తాయి. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. నిద్ర నిరోధక మాత్రలు మెడికల్‌ షాపుల్లో సులభంగా లభిస్తాయి. పరీక్షల సమయంలో యువత ఎక్కువగా ఈ మాత్రలు తీసుకుంటారు. ఎక్కువసార్లు యాంటీ స్లీపింగ్ పిల్స్ వేసుకోవడంతో లక్నోకు చెందిన ఓ విద్యార్ధి మెదడు నరాలు వాచిపోయాయి. ఇది మెదడులో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. దీంతో ఆ విద్యార్థి స్పృహ కోల్పోయాడు. వీటిని వాడితే మీకు కూడా ఇలాగే జరగవచ్చు. ఒక వ్యక్తి వరుసగా 7 రోజులు నిద్రపోకపోతే మరణం సంభవిస్తుంది. అలాగే, వైద్యుల సలహా లేకుండా నిద్ర నిరోధక మాత్రలు తీసుకోకూడదని సోమనాథ్ మైతీ వివరించారు.

జనవరి 2021- జనవరి 2022 మధ్య నిద్రపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం 35 దేశాల నుంచి 2,20,000 మందికి పైగా నిద్ర అలవాట్లను విశ్లేషించాచరు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, ఫిన్‌లాండ్‌కు చెందిన ఔరా హెల్త్ (ఔరా హెల్త్) అనే స్టార్టప్ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఆసియా దేశాల్లోని ప్రజలు వారానికి ఆరున్నర గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని వీరు గుర్తించారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల సగటు కంటే 30 నిమిషాలు తక్కువ. మరోవైపు ఉత్తర ఐరోపా దేశాలు (ఎస్టోనియా, ఫిన్లాండ్, ఐర్లాండ్ మరియు నెదర్లాండ్స్), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని ప్రజలు సగటున 7 గంటలు నిద్రపోతారని తేలిందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.