ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి

అవిసెగింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఈ గింజల ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, నెలసరి క్రమం తప్పకూడదన్నా అవిసెగింజల్ని ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్‌నాన్స్‌ అవిసె గింజల్లో ఉన్నాయి. ఇందులో మహిళలకు ఎంతో ఉపయోగకరమైన ఈస్ట్రోజన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, రొమ్ముక్యాన్సర్‌‌ను నిర్మూలించే.. ఒమెగా-త్రీ ఆమ్లాలు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి.

ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి

|

Updated on: Feb 21, 2024 | 1:26 PM

అవిసెగింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఈ గింజల ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, నెలసరి క్రమం తప్పకూడదన్నా అవిసెగింజల్ని ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్‌నాన్స్‌ అవిసె గింజల్లో ఉన్నాయి. ఇందులో మహిళలకు ఎంతో ఉపయోగకరమైన ఈస్ట్రోజన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, రొమ్ముక్యాన్సర్‌‌ను నిర్మూలించే.. ఒమెగా-త్రీ ఆమ్లాలు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజల్లోని పీచు జీర్ణక్రియల వేగాన్ని పెంచుతుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, నొప్పులు ఉండకూడదన్న, చురుగ్గా పనిచేయాలన్నా.. తగినంత ప్రొటీన్‌ అందాలి. ఎక్కువ మోతాదులో ప్రొటీన్‌ అందించే ఆహారంలో అవిసెగింజలు కూడా ఒకటి. అవిసె గింజలు కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. బరువూ అదుపులో ఉంటుంది. అంతేకాదు, ఇవి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. ర‌క్తపోటును త‌గ్గిస్తాయి. చ‌ర్మానికి మేలు చేస్తాయి. చేప‌లు తిన‌ని వారు వీటిని తీసుకుంటే.. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. ఇవి గుండెకు మేలు చేసే మంచి కొవ్వులు. అవిసె గింజల్లో మనకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌, విటమిన్‌ బి1, బి6, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు దొరుకుతాయి. రోజుకు రెండు చెంచాల అవిసె గింజలు తీసుకుంటే ప్రీ, పోస్ట్‌ మెనోపాజల్‌ దశలో వచ్చే ఇబ్బందులకు చెక్‌ పెట్టొచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతుల బెడదకు మహిళ ఉపాయం.. రూ.2000తో..

వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం

ఒకే బోనులో అక్బర్‌.. సీత.. విశ్వహిందూ పరిషత్‌ ఆగ్రహం..

ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్టయ్యాడు

మాఘమాసం వేళ మల్లెలకు ఫుల్ డిమాండ్‌..కేజీ ఎంతో తెలుసా ??

Follow us
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త