ఒకే బోనులో అక్బర్.. సీత.. విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం..
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ఉన్న సఫారీ పార్కులో అక్బర్, సీత అనే సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లోకి వదలడం విశ్వ హిందూ పరిషత్ ను ఆగ్రహానికి గురిచేసింది. అక్బర్ మగ సింహం కాగా, సీత ఆడసింహం. ఈ రెండు సింహాలను అటవీశాఖ అధికారులు ఇటీవలే త్రిపుర నుంచి సఫారీ పార్కుకు తీసుకువచ్చారు. అయితే, అటవీ అధికారుల చర్యను నిరసించిన వీహెచ్ పీ పశ్చిమ బెంగాల్ విభాగం... జల్పాయ్ గురిలోని కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేసింది.
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ఉన్న సఫారీ పార్కులో అక్బర్, సీత అనే సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లోకి వదలడం విశ్వ హిందూ పరిషత్ ను ఆగ్రహానికి గురిచేసింది. అక్బర్ మగ సింహం కాగా, సీత ఆడసింహం. ఈ రెండు సింహాలను అటవీశాఖ అధికారులు ఇటీవలే త్రిపుర నుంచి సఫారీ పార్కుకు తీసుకువచ్చారు. అయితే, అటవీ అధికారుల చర్యను నిరసించిన వీహెచ్ పీ పశ్చిమ బెంగాల్ విభాగం… జల్పాయ్ గురిలోని కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేసింది. అక్బర్ తో సీతను ఉంచడం హిందూ మతాన్ని కించపరిచే చర్య అని, పశ్చిమ బెంగాల్ అటవీ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కాగా, అటవీ శాఖ అధికారులు దీనిపై స్పందిస్తూ… తాము ఆ రెండు సింహాలను త్రిపురలోని సెపాహీ జాలా జూ నుంచి తీసుకువచ్చామని, వాటికి అక్బర్, సీత అనే పేర్లను తాము పెట్టలేదని స్పష్టం చేశారు. త్రిపురలోని జూ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్టయ్యాడు
మాఘమాసం వేళ మల్లెలకు ఫుల్ డిమాండ్..కేజీ ఎంతో తెలుసా ??
యువకుడి కక్కుర్తి.. పోలీసు వాహనంతో రీల్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

