యువకుడి కక్కుర్తి.. పోలీసు వాహనంతో రీల్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన లేకుండా వీడియోలు, రీల్స్ చేయడానికి రోడ్లు, మెట్రోలు, ఆసుపత్రులను వాడేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ యువకుడు ఇన్‌స్టా రీల్ చేయడానికి ఏకంగా పోలీసు జీప్‌నే వాడటంతో ఇబ్బందుల్లో పడ్డాడు. గాజియాబాద్‌లోని ఇందిరాపురంలో పోలీసులు తమ వాహనాన్ని నిలిపి ఉంచి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన లేకుండా వీడియోలు, రీల్స్ చేయడానికి రోడ్లు, మెట్రోలు, ఆసుపత్రులను వాడేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ యువకుడు ఇన్‌స్టా రీల్ చేయడానికి ఏకంగా పోలీసు జీప్‌నే వాడటంతో ఇబ్బందుల్లో పడ్డాడు. గాజియాబాద్‌లోని ఇందిరాపురంలో పోలీసులు తమ వాహనాన్ని నిలిపి ఉంచి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. అక్కడే ఉన్న మొయిన్ ఖురేషీ అనే యువకుడు దీనిని అవకాశంగా తీసుకొని రీల్ చేయడానికి పోలీసు జీపును వాడుకున్నాడు. సూట్ ధరించి పోలీసు వాహనం నుంచి దిగుతూ, ఎనర్జీ డ్రింక్ తాగుతూ రీల్ చేశాడు. దానికి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ జత చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది వైరలైంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో వారు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఇన్‌స్టా నుంచి వైరల్ వీడియో తొలగించామని పోలీసు అధికారి తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులకు షాక్
క్లాస్ రూమ్‌లో పిల్లల ఆటవిడుపు.. శంకరా అంటూ బుడ్డోళ్లు అదరగొట్టారుగా
బియ్యంనుంచే నేరుగా మాంసాహారం !! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు