Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు
ఫిబ్రవరి 18 ఆదివారం మెగాస్టార్ చిరంజీవి సతీమణి పుట్టినరోజు సందర్భంగా చిరు తనదైన స్టైల్లో భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెష్ చెప్పారు. ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. మెగా అత్తాకోడళ్లు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. కొణిదెల సురేఖ పుట్టినరోజును పురస్కరించుకుని అత్తమ్మాస్ కిచెన్ పేరిట కొత్త వ్యాపారం ప్రారంభించారు.
ఫిబ్రవరి 18 ఆదివారం మెగాస్టార్ చిరంజీవి సతీమణి పుట్టినరోజు సందర్భంగా చిరు తనదైన స్టైల్లో భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెష్ చెప్పారు. ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. మెగా అత్తాకోడళ్లు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. కొణిదెల సురేఖ పుట్టినరోజును పురస్కరించుకుని అత్తమ్మాస్ కిచెన్ పేరిట కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇంటి భోజనాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన ఉప్మా, పులిహోర, పొంగల్, రసం రెడీ టు కుక్ ప్యాకెట్లను ఆవిష్కరించారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర 1,099 రూపాయలుగా ఉంది. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి వాటిని పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయని వారు తెలిపారు. దీనిపై ఉపాసన స్పందిస్తూ, నేరుగా మా వంట గది నుంచే మీ ఇంటికి ఈ రెడీ టు కుక్ పదార్థాలు అందుతాయి… తరతరాల ఆహార అనుబంధాన్ని ఆస్వాదించండి అంటూ ట్వీట్ చేశారు. కాగా, అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు, రెసిపీలకు ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా athammaskitchen.com వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ఆన్ లైన్ లో తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి
హాల్‌టికెట్‌పై ప్రముఖ హీరోయిన్ ఫోటో.. అవాక్కయిన స్టూడెంట్
టిప్పు తెచ్చిన తంటా.. ఉద్యోగమే ఊడిపోయిందిగా..
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

