ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్టయ్యాడు
ఈ యువకుడిని చూస్తే కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు అని పాట అందుకుంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది ఓ యువకుడు మూడు గెజిటెడ్ ఉద్యోగాలతో సహా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదే సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి కుమారుడు గాదే సాయి లెనిన్ చిన్నతనం నుండి చదువుల్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తూ వస్తున్నాడు.
ఈ యువకుడిని చూస్తే కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు అని పాట అందుకుంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది ఓ యువకుడు మూడు గెజిటెడ్ ఉద్యోగాలతో సహా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదే సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి కుమారుడు గాదే సాయి లెనిన్ చిన్నతనం నుండి చదువుల్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తూ వస్తున్నాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నాలుగు పోటీ పరీక్షలలో.. నాలుగు ఉద్యోగాలనూ సాధించి సత్తా చాటాడు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా కూడా ఉద్యోగ అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. సాయి లెనిన్ గోదావరిఖనిలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాదులో, బీటెక్ వరంగల్ లో పూర్తి చేశాడు. గేట్ ద్వారా హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసాడు. ఈ క్రమంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన గోదావరిఖని ఎక్సైజ్ సిఐ స్ఫూర్తితో పోటి పరీక్షలకు సిద్ధమయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాఘమాసం వేళ మల్లెలకు ఫుల్ డిమాండ్..కేజీ ఎంతో తెలుసా ??
యువకుడి కక్కుర్తి.. పోలీసు వాహనంతో రీల్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

