AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid Diet: యూరిక్‌ యాసిడ్‌ ఉన్న వారు ఏవి తినాలి.. ఏవి తినకూడదు! ఇక్కడ తెలుసుకోండి..

ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత నేలపై అడుగు పెట్టలేకపోతున్నారా? పాదాలు ఉబ్బిపోయి తీవ్ర నొప్పి కలుగుతోందా? కీళ్లనొప్పుల సమస్య అనుకుంటే ప్రమాదమే.. వెంటనే యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. యూరిక్ యాసిడ్ పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారిలో యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నియంత్రణ లేని జీవనశైలి..

Uric Acid Diet: యూరిక్‌ యాసిడ్‌ ఉన్న వారు ఏవి తినాలి.. ఏవి తినకూడదు! ఇక్కడ తెలుసుకోండి..
Uric Acid Diet
Srilakshmi C
|

Updated on: Feb 22, 2024 | 1:03 PM

Share

ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత నేలపై అడుగు పెట్టలేకపోతున్నారా? పాదాలు ఉబ్బిపోయి తీవ్ర నొప్పి కలుగుతోందా? కీళ్లనొప్పుల సమస్య అనుకుంటే ప్రమాదమే.. వెంటనే యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. యూరిక్ యాసిడ్ పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారిలో యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నియంత్రణ లేని జీవనశైలి ఈ సమస్య వెనుక ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. అంతే కాకుండా సరైన సమయానికి తినకపోవడం, తక్కువ నీరు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి క్రమంగా పెరిగితే, అది మూత్రపిండాల వ్యాధికి కారణమవుతుంది. గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్‌ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

గతంలో నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ సమస్యతో బాధపడేవారు. ఇప్పుడు ఈ సమస్య అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతోంది. కొంతమంది చిన్న వయసులోనే యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి శాశ్వత చికిత్స లేదు. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. అన్నింటిలో మొదటిది… ఆహారంపై శ్రద్ధ వహించాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు మీరు తినే ఆహారంపై ఆధారపడి ఉంటాయి. ఏదిపడితే అది తినకూడదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సరైన డైట్ పాటించాలి. యూరిక్ యాసిడ్ సమస్యలకు దూరంగా ఉండేందుకు ఏయే ఆహారాలు తినాలో, ఏయే ఆహారాలు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

ఏం తినాలంటే..

పౌష్టికాహారం

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అవసరం. పోషకాల లోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యలలో ఒకటి యూరిక్ యాసిడ్. కాబట్టి చికెన్, పాలకూర, చిక్‌పీస్, పాలు, గుడ్లను ఆహారంలో తప్పక చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

విటమిన్ సి

విటమిన్ సి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి నిమ్మ లేదా సిట్రస్ పండ్లను ఎక్కువగా తినాలి. అలాగే చెర్రీస్, స్ట్రాబెర్రీలు లేదా ఏవైనా పుల్లని పండ్లు తినాలి. ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మరింత ప్రయోజనం పొందవచ్చు.

ఫైబర్ రిచ్ ఫుడ్స్

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. గుమ్మడికాయ, బ్రోకలీ, ఓట్స్, తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆహారాలలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

వెజిటబుల్ ప్రొటీన్

ఆరోగ్యంగా ఉండాలంటే వెజిటబుల్ ప్రోటీన్ తినడం చాలా ముఖ్యం. జంతు ప్రోటీన్ యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతుంది. కాబట్టి యానిమల్ ప్రొటీన్ వదిలి వెజిటబుల్ ప్రొటీన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఏమేం తినకూడదంటే..

యాపిల్స్

యాపిల్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అలాగే ఇందులో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాపిల్‌ పండ్లను అస్సలు తిన కూడదు.

ఖర్జూరం

ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మాత్రం ఖర్జూరం తినకూడదు.

విత్తనాలతో కూడిన ఆహారాలు

విత్తనాలు ఉన్న కూరగాయలు ఏవైనా తినకూడదు. విత్తనాలు యూరిక్ యాసిడ్‌ను పెంచుతాయి. కాబట్టి విత్తనాలను తొలగించిన కూరగాయలను మాత్రమే తినాలి.

కాయధాన్యాలు

కాయధాన్యాలు, బఠానీలు, చిక్‌పీస్, పాలకూర, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగులలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.