గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి పలు రకాల వ్యాధులను తగ్గించడంలో నల్ల జీలకర్ర బాగా పనిచేస్తుంది. చాలా మందికి పొట్టలో పుండ్లు వస్తుంటాయి. కానీ ఆ విషయం తెలియక ఏవేవో తింటూ ఇంకాస్త ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ఉంటారు. అలాంటివారు నల్ల జీలకర్రను తీసుకుంటే కడుపులో పుండ్లు రాకుండా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని సంరక్షిస్తుంది. ఇంకా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.