Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corn silk benefits: పీచే కదా అని అలుసుగా తీసుకోవద్దు..! మొక్కజొన్న మాత్రమే కాదు.. ఇది కూడా ఈ 6 వ్యాధులకు దివ్యౌషధం..!

మొక్కజొన్న గింజల్లో ఫైబర్, విటమిన్ సి, కె, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు. అయితే, మనందరం మొక్కజొన్న గింజలను తింటాం.. కానీ, దాని చుట్టూ ఉండే, పీచు పదార్థాన్ని పారవేస్తాము. కానీ, మొక్కజొన్న మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, దాని జుట్టు కూడా అంతే మేలు చేస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Corn silk benefits: పీచే కదా అని అలుసుగా తీసుకోవద్దు..! మొక్కజొన్న మాత్రమే కాదు.. ఇది కూడా ఈ 6 వ్యాధులకు దివ్యౌషధం..!
Corn Silk
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 22, 2024 | 3:07 PM

మొక్కజొన్న రుచి చాలా మందికి ఇష్టం. మనం దానిని నిప్పులో కాల్చి లేదా ఉడికించి తింటాము. ఇక వానాకాలంలో వేడి వేడిగా కాల్చిన మక్కబుట్టపై ఉప్పుకారం నిమ్మకాయ పిండితింటుంటే ఉంటది..! ఆహా ఆ రుచే వేరు..! ఇకపోతే, మొక్కజొన్న గింజలతో రకరకాల బజ్జీలు, వడలు వంటివి కూడా చేసుకుని తింటుంటారు. మొక్కజొన్న గింజల్లో ఫైబర్, విటమిన్ సి, కె, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు. అయితే, మనందరం మొక్కజొన్న గింజలను తింటాం.. కానీ, దాని చుట్టూ ఉండే, పీచు పదార్థాన్ని పారవేస్తాము. కానీ, మొక్కజొన్న మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, దాని జుట్టు కూడా అంతే మేలు చేస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

మొక్కజొన్న పీచుతో ఆరోగ్య ప్రయోజనాలు:

1. కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది: కొలెస్ట్రాల్‌ పెరగడం అనేది ఈ రోజుల్లో అతి పెద్ద సమస్యగా మారింది. సమయానికి దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. లేదంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మొక్కజొన్న పీచు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

2. మధుమేహం నియంత్రణ: మధుమేహంతో బాధపడే వారికి మొక్కజొన్న పీచు ఒక వరం. ఇవి యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉన్నాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పూర్తిగా నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కరోనా కాలం నుండి, ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు. మొక్కజొన్న ఫైబర్‌లో విటమిన్ సి ఉండటం వల్ల, దీని వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : కడుపు సమస్యలతో బాధపడేవారు మొక్కజొన్న పీచును తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.

5. గర్భిణీ స్త్రీలకు ప్రయోజనాలు: గర్భిణీ స్త్రీలు మొక్కజొన్న ఫైబర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా పనిచేస్తుంది.

6. కిడ్నీలకు సూపర్ మెడిసిన్: మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మొక్కజొన్న పీచు కిడ్నీలకు సూపర్ మెడిసిన్ అని చెబుతారు. ఇది కిడ్నీలలోని ప్రమాదకర టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. రోజూ ఈ టీ తాగితే.. కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించవచ్చు. మొక్కజొన్న పీచులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..