Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Living Under Sea: సముద్రం అడుగున 100 రోజులు నివసించి రికార్డు సృష్టించిన అమెరికా వాసి.. వీడియో వైరల్

అమెరికా నావికా దళం మాజీ డైవర్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలిస్ట్‌ జో డిటూరీ సముద్రం నీటి అడుగున 100 రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నమోదైన 74 రోజుల రికార్డును అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫ్లోరిడా కీస్ సమీపంలో సముద్రంలో 30 అడుగుల దిగువన ఉన్న 55 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డిటూరి నివాసం ఏర్పరచుకున్నాడు. గతేడాది మార్చి 1 నుంచి దాదాపు 100 రోజులపాటు నీటి..

Living Under Sea: సముద్రం అడుగున 100 రోజులు నివసించి రికార్డు సృష్టించిన అమెరికా వాసి.. వీడియో వైరల్
Living Under Sea
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 22, 2024 | 9:04 AM

న్యూయార్క్‌, ఫిబ్రవరి 22: అమెరికా నావికా దళం మాజీ డైవర్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలిస్ట్‌ జో డిటూరీ సముద్రం నీటి అడుగున 100 రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నమోదైన 74 రోజుల రికార్డును అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫ్లోరిడా కీస్ సమీపంలో సముద్రంలో 30 అడుగుల దిగువన ఉన్న 55 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డిటూరి నివాసం ఏర్పరచుకున్నాడు. గతేడాది మార్చి 1 నుంచి దాదాపు 100 రోజులపాటు నీటి అడుగున ఉండేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. ఎన్నో సవాళ్లతో కూడిన ఈ సాహసాన్ని డిటూరీ విజయవంతంగా పూర్తి చేశాడు. నీటి అడుగున మానవుల నివాసం సాధ్యాసాధ్యాలపై ఆయన అధ్యయనం చేశాడు.

సముద్ర గర్భంలో వంద రోజులు జీవించిన అనుభవాన్ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. 100 రోజుల పాటు సముద్రగర్భంలో జీవించడం, ఏదైనా క్రొత్తదాన్ని అన్వేషించడం ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ అనుభవం నన్ను ముఖ్యమైన మార్గాల్లో మార్చింది. కొత్త తరం అన్వేషకులు, పరిశోధకులను అన్ని హద్దులను అధిగమించేలా నా అధ్యయనం ప్రేరణగా నిలుస్తానని అశిస్తున్నట్లు ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

నీటి అడుగున జీవించడం భవిష్యత్ అన్వేషకులకు ప్రోత్సాహం

డిటూరీ సాధించిన విజయం పలువురిని ఆకర్షించడమే కాకుండా కొత్త తరం అన్వేషకులు, పరిశోధకులకు స్ఫూర్తినిచ్చినట్లైంది. సోషల్ మీడియాలో డిటూరి పంచుకున్న విషయాలు గత హద్దులను అధిగమించేలా ఔత్సాహికులను ప్రోత్సహిస్తుందని, ఉత్సుకత, అన్వేషణ స్ఫూర్తిని పెంపొందిస్తుంది. డిటూరి అంకిత భావానికి నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ఆయన ఇన్‌స్టా పోస్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. డిటూరి ప్రయోగం ద్వారా సముద్రపు నీటి అడుగున ఎక్కువ కాలం మానవులు నివసించవచ్చునని ఆయన నిరూపించారు. సముద్రంలో 100 రోజులపాటు నివసించిన అనుభవం తన జీవితాన్ని మార్చిందని ఆయన తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.