AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy: యూట్యూబ్‌ చూస్తూ ఇంట్లోనే బిడ్డను కనాలని భర్త కండీషన్‌.. ప్రాణాలొదిలిన తల్లీబిడ్డ!

ఆన్‌లైన్‌లో చూస్తూ ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా ఇంట్లోనే బిడ్డను ప్రసవించాలని ప్రయత్నించిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో బిడ్డ ప్రాణాలు కూడా పోయాయి. ఈ ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం సాయంత్రం (ఫిబ్రవరి 20) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Pregnancy: యూట్యూబ్‌ చూస్తూ ఇంట్లోనే బిడ్డను కనాలని భర్త కండీషన్‌.. ప్రాణాలొదిలిన తల్లీబిడ్డ!
Pregnancy Woman Died In Kerala
Srilakshmi C
|

Updated on: Feb 22, 2024 | 7:12 AM

Share

తిరువనంతపురం, ఫిబ్రవరి 22: ఆన్‌లైన్‌లో చూస్తూ ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా ఇంట్లోనే బిడ్డను ప్రసవించాలని ప్రయత్నించిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో బిడ్డ ప్రాణాలు కూడా పోయాయి. ఈ ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం సాయంత్రం (ఫిబ్రవరి 20) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కేరళలోని తిరువనంతపురం కరక్కమండపానికి షెమీరా బీవీ (36) అనే మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం. నాలుగోసారి గర్భం దాల్చిన షెమీరా 9 నెలలు నిండే వరకూ వైద్యులను సంప్రదించలేదు. భర్తతో కలిసి ఆక్యుపంక్చర్‌ నిపుణుడి వద్ద వైద్యం చేయించుకునేది. తాజాగా ఆమెకు పురటినొప్పులు వచ్చాయి. అయితే ఇంట్లోనే ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. నొప్పులతో తీవ్ర రక్తస్రావమయ్యి పరిస్థితి విషయమించడంతో చివరకు ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ తల్లీబిడ్డా మరణించారు. ఈ వార్త బయటికి పొక్కడంతో స్థానిక కౌన్సిలర్‌, ఆశా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయాజ్‌ తన భార్యను వైద్యుడి వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతించలేదని, ఆమెకు సరైన వైద్యం అందించలేదని ఆరోపించారు. ఆశా వర్కర్లు వారి ఇంట్లోకి వెళ్లేందుకు, కనీసం గర్భిణీతో మాట్లాండేకు కూడా నయాజ్‌ అనుమతించలేదని వార్డు కౌన్సిలర్ దీపిక పోలీసులకు తెలిపారు. అయినా ఓసారి ఎలాగోలా ఆమె ఇంట్లోకి వెళ్లి మాట్లాడగా, అది ఆమెకు నాలుగో గర్భం అని తెలసుకున్నామన్నారు. అంతేకాకుండా గత ప్రసవాల్నీ సిజేరియన్ ద్వారా జరిగాయని, ఆమెకు ఏ విధంగానూ నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశం లేదని తెలిపారు.

అయితే భర్త నయాజ్‌ మాత్రం భార్యకు సాధారణ ప్రసవం కావాలని, అందుకు యూట్యూబ్‌లో నార్మల్‌ డెలివరీకి సంబంధించిన వీడియోలు చూసేవాడని తెలిపారు. షెమీరాను ఇరుగుపొరుగువారితో మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదని ఆరోపించారు. ఫోన్‌ చేసిన మాతో మాట్లాడటానికి ఆమె భయపడేది. గర్భిణీ మహిళకు సరైన చికిత్స చేయించమని మేము అతనికి సలహా ఇచ్చినా.. ఆమె నా భార్య, ఆమె ఆరోగ్యం గురించి ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కఠువుగా సమాధానం చెప్పేవాడని ఇరుగుపొరుగు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షెమీరా భర్త నయాజ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ మృతికి కారణాలపై విచారణ జరుగుతోంది, వివరాలు సేకరించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ ఘటనను హత్యానేరం కింద పరిగణిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.