Viral: గాల్లో ఊగిపోయిన విమానం.. ప్రాణ భయంతో ప్రయాణికులు.! వీడియో వైరల్.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో విమానం సోమవారం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరింది.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో విమానం సోమవారం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరింది. ఆ తర్వాత కాసేపటికే భారీ వర్షం కారణంగా విమానం ఊగిపోయింది. టేకాఫ్ విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుర్చీలను గట్టిగా పట్టుకుని కేకలు వేశారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న కశ్మీర్ సేవా సంఘ్ చీఫ్ బాబా ఫిర్దౌస్ ఘటనపై స్పందిస్తూ.. తనతోపాటు విమానంలోని అందరికీ పునర్జన్మ లభించదని పేర్కొన్నారు. సోమవారం గుల్మార్గ్ స్కీయింగ్ రిసార్ట్‌తో సహా ఎత్తైన ప్రాంతాలలో భారీగా మంచు కురిసింది. జమ్ముకశ్మీర్ సహా నిన్న పలుప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మంచు భారీగా కురిసింది. ఫలితంగా కొండచరియలు విరిగిపడడంతో జమ్ము – శ్రీనిగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా అంతర్రాష్ట్ర రహదారులను మూసివేశారు. దీంతో వందలాదిమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

