Ayurveda Tips: ఈ పువ్వులతో స్నేహం చేయండి.. మగవారిలో లైంగిక సామర్ధ్యం పెంచడమే కాదు సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది

మునగ పువ్వులు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కనుక ఈ సీజన్‌లో వీటిని  తినడం వలన జ్వరం, జలుబు దరిచేరవు. వీటితో చేసిన ఆహారం తినడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పూలు తినడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఈ పువ్వులు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ పరిమితం కాదు. పురుషుల  లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనే విషయం కొంత మందికి మాత్రమే తెలిసి  ఉండవచ్చు.   

Ayurveda Tips: ఈ పువ్వులతో స్నేహం చేయండి.. మగవారిలో లైంగిక సామర్ధ్యం పెంచడమే కాదు సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది
Drumstick Flower Benefits
Follow us

|

Updated on: Feb 18, 2024 | 8:54 PM

శీతాకాలం నుంచి వేసవి కాలంలో అడుగు పెడుతున్నాం.. మరోవైపు వసంత గాలి వీస్తోంది. దీనితోపాటు సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతాయి. సీజనల్ మార్పు సమయంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ సీజన్‌లో జ్వరం-జలుబు చాలా సాధారణ సమస్య. అంతేకాదు స్ప్రింగ్ ఫీవర్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులు బారిన పడేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ సమయంలో అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ఆహారం మాత్రమే సరైన పధ్ధతి. తాజా పండ్ల నుండి కూరగాయల వరకు ఈ ఆహారాలు తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. వసంత ఋతువులో వచ్చే వ్యాధులను నివారించడానికి మరొక ఉపయోగకరమైన ఆహారం మునగ పువ్వు.

మునగ పువ్వులు దొరికే సీజన్ ఇదే.. అది కూడా కేవలం కొన్ని వారాలు మాత్రమే దొరుకుతాయి. ఈ సమయంలోనే మునగ పువ్వులను తింటే వ్యాధి సోకే అవకాశాలు తగ్గుతాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్నాయి. అంతేకాదు విటమిన్ ఎ, బి1, బి2, బి3 , సి ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఈ పువ్వులో ఉంటాయి. పువ్వులు బ్యాక్టీరియాతో పోరాడే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

మునగ పువ్వులు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కనుక ఈ సీజన్‌లో వీటిని  తినడం వలన జ్వరం, జలుబు దరిచేరవు. వీటితో చేసిన ఆహారం తినడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పూలు తినడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఈ పువ్వులు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ పరిమితం కాదు. పురుషుల  లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనే విషయం కొంత మందికి మాత్రమే తెలిసి  ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చక్కటి ఔషధం మునగ పువ్వులు అని అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ద్వారా తెలుస్తోంది. టెరిగోస్పెర్మిన్ అనే సమ్మేళనం వంధ్యత్వ సమస్యలను తొలగిస్తుంది. స్పెర్మ్ కౌంట్ ను పెంచడమే కాదు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి పువ్వులు కీలకం.

సాధారణంగా ఈ పువ్వులను వేయించి లేదా పచ్చడి చేసుకుని తింటారు. ఇలా పూలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, మెరుగైన సెక్స్ జీవితాన్ని అందంగా గడపడం కోసం మునగ పువ్వులను కొద్దిగా భిన్నంగా తినండి. ఈ పువ్వులను పాలతో ఉడకబెట్టండి. యాలకుల పొడి కలుపుకుని తాగాలి. ఇలా ఒక గ్లాస్ మునగాకు పువ్వుల మిల్క్ తాగడం వల్ల శృంగార కోరిక పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Latest Articles