- Telugu News Photo Gallery Grapes For skin: How To Use Grapes For Getting Glowing Skin, Check Out Here
Grapes For Skin: ముఖసౌందర్యానికి ద్రాక్ష.. మీరు ఎప్పటికీ తెలుసుకోలేని ప్రయోజనాలు!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ద్రాక్షకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ప్రతిరోజూ తప్పనిసరిగా ద్రాక్షను తింటారు. ముఖ్యంగా నల్ల ద్రాక్ష. ఇవి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ద్రాక్ష శరీరానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు ద్రాక్షరసం ఎంతో ఉపయోగపడుతుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్ సమస్య నుంచి టాన్ వరకు, అన్ని సమస్యలను పరిష్కరించడానికి ద్రాక్ష ప్రభావవంతంగా పనిచేస్తుంది..
Updated on: Feb 18, 2024 | 8:52 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ద్రాక్షకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ప్రతిరోజూ తప్పనిసరిగా ద్రాక్షను తింటారు. ముఖ్యంగా నల్ల ద్రాక్ష. ఇవి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.

ద్రాక్ష శరీరానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు ద్రాక్షరసం ఎంతో ఉపయోగపడుతుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్ సమస్య నుంచి టాన్ వరకు, అన్ని సమస్యలను పరిష్కరించడానికి ద్రాక్ష ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కొన్ని ద్రాక్షలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయాలి. డార్క్ సర్కిల్స్ కాకుండా, మొటిమల సమస్యలకు చికిత్స చేయడంలోనూ ద్రాక్ష సహాయపడుతుంది.

సాధారణంగా, జిడ్డుగల చర్మం వారికి మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. ద్రాక్ష చర్మం నుంచి అదనపు నూనెను పీల్చుకుని తద్వారా మొటిమలను తొలగిస్తుంది. అందుకు ద్రాక్షలను ఏవిధంగా ఉపయోగించాలో, అది ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం..

కొన్ని ద్రాక్ష పళ్లను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ముల్తానీ మట్టిని తీసుకోవాలి. అందులో ఈ పేస్ట్, నీరు కలుపుకోవాలి. ఈ ప్యాక్‌ని మొటిమలు వచ్చే ప్రాంతంలో బాగా అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే సరి.





























