- Telugu News Photo Gallery Cricket photos Team India Jump To Second In WTC Points Table After 434 Run Win Over England In Rajkot Telugu Cricket News
WTC Points Table: ఇంగ్లండ్‌ను మడతెట్టేసిన టీమిండియా.. WTC ఫైనల్ రేసు నుంచి ఔట్.. రోహిత్ సేన ఏ స్థానంలో ఉందంటే?
రాజ్‌కోట్ టెస్టులో 434 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. ఈ భారీ విజయంతో ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది రోహిత్ సేన. అలాగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా భారత్ స్థానం మరింత మెరుగు పడింది.
Updated on: Feb 18, 2024 | 8:45 PM

రాజ్‌కోట్ టెస్టులో 434 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. ఈ భారీ విజయంతో ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది రోహిత్ సేన. అలాగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా భారత్ స్థానం మరింత మెరుగు పడింది.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గతంలో ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు మళ్లీ భారత జట్టు సెకెండ్ ప్లేస్‌కు దూసుకొచ్చింది.

59.52 విజయాల శాతంతో టీం ఇండియా రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు విజయ శాతం 55.00తో మూడో స్థానానికి పడిపోయింది. ఇటీవలే దక్షిణాఫ్రికాను 2-0తో ఓడించిన న్యూజిలాండ్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో గతంలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత 5వ స్థానానికి పడిపోయింది. అయితే రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా మళ్లీ తన స్థానాన్ని కైవసం చేసుకుంది.

భారత్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారీ పతనాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌కు ముందు 25.00 పీసీటీ పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు 21.87 పీసీటీ పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. తద్వారా 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి ఇంగ్లండ్ జట్టు దాదాపుగా నిష్క్రమించింది.





























