- Telugu News Photo Gallery Health Tips: Urinal infection can decrease by coriander seed water drinking
Urinal Infection: మూత్రంలో మంటా.. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా.. ధనియాల నీరు బెస్ట్ మెడిసిన్.. ఎలా తీసుకోవాలంటే..
కొంతమందిలో మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటతో బాధపడతారు. మూత్రంలో మంట అనేది మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణం అవ్వొచ్చు. అవును చాలామంది మళ్లీ మూత్ర విసర్జన చేసేటప్పుడు యోనిలో మంట లేదా పురుషాంగంలో తేలికపాటి నొప్పిని కూడా అనుభవిస్తారు. మొదట్లో చాలా మంది ఈ సమస్యను పట్టించుకోరు. అయితే ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన సమస్యగా మారుతుంది.
Updated on: Feb 19, 2024 | 9:00 AM

మూత్ర విసర్జన సమయంలో మంట వచ్చినా, నొప్పి వచ్చినా ఆ విషయాన్ని ఎవరికైనా చెప్పడానికి చాలా మంది సిగ్గుపడతారు. అంతేకాదు డాక్టర్ దగ్గరకు వెళ్లాలని కూడా అనుకోరు. అయితే మొదట్లోనే మూత్రంలో మంట సమస్యను సింపుల్ చిట్కాలతో తగ్గించుకొవచ్చు. మూత్రవిసర్జన సమయంలో చికాకు లేదా నొప్పిని తొలగించడం సాధ్యమవుతుంది

ప్రాథమికంగా, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పిని కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌కు నివారణణకు ధనియాలు, ధనియాలు నానబెట్టిన నీరు చక్కగా పనిచేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్తిమీర గింజల నీరు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు 'సూపర్ హీరో'.

కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా ధనియాలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఒకటిన్నర కప్పుల నీటిలో రాత్రంతా నానబెట్టండి. మర్నాడు ఉదయం నానబెట్టిన ధనియాలను తినండి.

ధనియాలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. అంతేకాదు ధనియాల వాటర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి

ధనియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు ధనియాల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో పాటు, ధనియాల నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ధనియాల నీటిని తాగడం వలన మేలు జరుగుతుంది.

ప్రతిరోజూ ఉదయం ధనియాల నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కనుక మీరు దీన్ని డిటాక్స్ వాటర్‌గా తాగవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ధనియాల నీటిని తాగడం ద్వారా బరువు తగ్గుతారు.





























