Viral News: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోకుండా పండగక్కి ఇంటికి చేరుకోవడానికి ఏం చేశాడంటే
ట్రాఫిక్ జామ్ సమస్యను నివారించడానికి ఓ వ్యక్తి డిఫరెంట్ రవాణా విధానాన్ని ఎంచుకున్నాడు. దీనిని సాధారణంగా ఎవరు, ఎన్నడూ ఎంచుకోరు. ఆ వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తెతో కలిసి తన గ్రామానికి వెళ్లేందుకు రెండు సీట్ల ప్రైవేట్ విమానాన్ని బుక్ చేసుకుని, గాలిలో ఎగురుతూ తన ఇంటికి చేరుకున్నాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనాలో లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా.. భారీ సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటారు.
ట్రాఫిక్ జామ్ సమస్య చాలా తీవ్రమైన సమస్య . ఈ సమస్య భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. చాలా సార్లు జామ్ అయినప్పుడు అనేక కిలోమీటర్ల వరకు సాగుతుంది. కొన్నిసార్లు ఈ ట్రాఫిక్ జామ్ సాయంత్రం నుంచి ఉదయం వరకు ఉన్నా సరే వాహనాలు ఒక్క అంగుళం కూడా కదలని సంఘటలున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. చైనాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ట్రాఫిక్ జామ్ సమస్యను నివారించడానికి ఓ వ్యక్తి డిఫరెంట్ రవాణా విధానాన్ని ఎంచుకున్నాడు. దీనిని సాధారణంగా ఎవరు, ఎన్నడూ ఎంచుకోరు. ఆ వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తెతో కలిసి తన గ్రామానికి వెళ్లేందుకు రెండు సీట్ల ప్రైవేట్ విమానాన్ని బుక్ చేసుకుని, గాలిలో ఎగురుతూ తన ఇంటికి చేరుకున్నాడు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనాలో లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా.. భారీ సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటారు. కుటుంబం మొత్తం కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో.. దేశం మొత్తం రద్దీ నెలకొంటుంది. సొంత వాహనాల్లో ప్రయాణించేవారు కూడా ఎక్కువగా ఉంటారు. దీంతో చాలా చోట్ల రోడ్లు జామ్ అవుతాయి.
ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి ప్రత్యేక పరిష్కారం
వాంగ్ అనే వ్యక్తి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి తన కుటుంబ సభ్యులతో గడపడం కోసం తన ఇంటికి.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని భావించాడు. అయితే ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకోవడానికి అతను ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు.
నివేదికల ప్రకారం వాంగ్ తన తల్లిదండ్రుల ఇంటికి విమానంలో వెళ్లాలని భావించాడు. విమానాన్ని బుక్ చేసుకుని కేవలం 50 నిమిషాలు ప్రయాణించి సొంత ఊరుకు చేరుకున్నాడు. సాధారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వాంగ్ స్వయంగా విమానం నడిపి సొంతూరికి చేరుకున్నాడు.
విమానం పార్క్ చేసేందుకు అనుమతి
అయితే వాంగ్ తన ఇంటికి విమానంలో వెళ్లడం అంత సులభంగా అవ్వలేదు. ముందుగా అతను విమానంలో ప్రయాణించడానికి..విమానాన్ని పార్క్ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాడు. వాంగ్ ఇంటికి చేరుకోవడానికి, తన తల్లిదండ్రుల ఇంటికి సమీపంలోని ఫ్లయింగ్ క్యాంపులో విమానాన్ని పార్క్ చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నాడు. ఈ విషయం చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..