Kitchen Hacks: కూరలో కారం ఎక్కువైందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం.. రుచికి రుచి ప్రాబ్లెమ్ సాల్వ్..

కొన్నిసార్లు తినే ఆహారంలో కారం ఎక్కువై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతవరకూ ఆహారం తయారీ కోసం చేసిన శ్రమ వృధా అయిందని కొందరు ఫీల్ అవుతారు.  అయితే కూరలు తయారు చేసినప్పుడు ఎప్పుడైనా పొరపాటున కూరలో కారంలో ఎక్కువైతే ఆ ఆహారం వృధా అయిందని చింత వద్దు.. ఎందుకంటే కొన్ని చిట్కాలను పాటించండి.. కూరలో కారాన్ని తగ్గించుకోండి. వివరాల్లోకి వెళ్తే..

Kitchen Hacks: కూరలో కారం ఎక్కువైందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం.. రుచికి రుచి ప్రాబ్లెమ్ సాల్వ్..
Kitchen Hacks
Follow us

|

Updated on: Feb 26, 2024 | 9:30 AM

భారతీయులు తినేటంత స్పైసీ ఫుడ్‌ను ప్రపంచంలో మరెక్కడా తినరు. అందులో కొందరు మరీ ఎక్కువ స్పైసీ ఫుడ్ ని ఇష్టపడతారు. షడ్రుచులలో ఒకటి కారం. ఈ రుచిలేని ఆహారం అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు తినే ఆహారంలో కారం ఎక్కువై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతవరకూ ఆహారం తయారీ కోసం చేసిన శ్రమ వృధా అయిందని కొందరు ఫీల్ అవుతారు.  అయితే కూరలు తయారు చేసినప్పుడు ఎప్పుడైనా పొరపాటున కూరలో కారంలో ఎక్కువైతే ఆ ఆహారం వృధా అయిందని చింత వద్దు.. ఎందుకంటే కొన్ని చిట్కాలను పాటించండి.. కూరలో కారాన్ని తగ్గించుకోండి. వివరాల్లోకి వెళ్తే..

టమాట గుజ్జు

కొన్ని సార్లు కూరలు తయారు చేసే సమయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మిర్చి ఉంటుంది. అటు వంటి పరిస్థితిలో మీరు వండిన కూరలో కారంగా తగ్గించడానికి టమోటా పేస్ట్ జోడించవచ్చు. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ముందుగా టమాటో పేస్ట్ ని తయారు చేసి దానిని బాణలిలో వేసి కొంచెం నూనె వేసి వేయించాలి. తర్వాత ఆ పేస్ట్ ను వండిన కూరలో కలిపి కొంచెం వేగనివ్వాలి.

దేశీ నెయ్యి:

ఏదైనా కూరలో కారం ఎక్కువగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారంగా తగ్గించడానికి దేశీ నెయ్యి లేదా వెన్నని జోడించవచ్చు. దీనివల్ల కూర రుచి పెరగడమే కాకుండా కారం కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

 క్రీమ్

పొరపాటున మీరు తయారు చేసిన కూరలో కారం లేదా మసాలా ఎక్కువైతే.. ఆ కూరకు క్రీమ్ జోడించండి. క్రీమ్ ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూరగాయ చిక్కగా మారడమే కాకుండా కారం కూడా తగ్గుతుంది. మసాలా కూరగాయలకు క్రీమ్ వేసి మీడియం మంటలో ఉడికించాలి.

బియ్యం పిండి

ఆహారంలో కారం ఘాతుని తగ్గించడానికి కూడా బియ్యం పిండి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీని కోసం, 3 నుండి 4 స్పూన్ల పిండిని కొంచెం నూనెలో వేయించాలి. దీని తరువాత తయారు చేసిన కూరలో ఈ వేయంచిన పిండిని జోడించండి. వెజిటబుల్ గ్రేవీ పిండి సహాయంతో చాలా చిక్కగా రుచికరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..