AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చలికి తట్టుకోలేకపోతున్నారా?.. ఈ సింపుల్‌ టిప్స్ పాటిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు!

ప్రస్తుతం శీతాకాలం బయటకు అడుగు పెట్టాలంటేనే వనుకు పడుతోంది. ఓ వైపు మార్నింగ్ 8 అయినా చలి తగ్గట్లేదు.. అలాగే సాయంత్రం 5 అవగ్గానే చలి కమ్మేస్తుంది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా తీవ్ర చలిని ఎదుర్కొంటుంటే మీ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Jan 10, 2026 | 8:05 AM

Share
శరీరంలో వేడిని పెంచే ఆహారం: మన ఆహారం మన శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, కాబట్టి శీతాకాలంలో, మన శరీరానికి వెచ్చదనాన్ని అందించే  ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు బెల్లం, నువ్వులు, వేరుశెనగలు, జొన్నలు, జొన్నలు, ఎండిన అల్లం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడంలో మీకు సహాయపడుతాయి. అలాగే పడుకునే ముందు పసుపు పాలు లేదా అల్లం టీ తాగడం అలవాటు చేసుకోవడి. దీని వల్ల జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

1 / 5
ఆవ నూనె: సాధారణంగా చిన్న పిల్లలకు ఆవనూనెతో మసాజ్ చేయడం మీరు చూసే ఉంటారు. ఎంకంటే ఆవాల నూనె శరీరాన్ని వేడి చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ప్రతిరోజూ ఆవాల నూనెతో తేలికపాటి మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే వెల్లుల్లి కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు అవనూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను యాడ్‌ చేసి వేడి చేసుకొని మీ శరీరానికి మసాజ్ చేసుకోండి. ముఖ్యంగా పాదాలు, మెడ, వీపును మసాజ్ చేయడం వల్ల జలుబు నుండి రక్షణ లభిస్తుంది.

2 / 5
సరైన బట్టలు దరించడం: చలికాలంలో జనాలు ఎక్కువగా దుప్పట్లలా ఉండే దుస్తులు ధరిస్తారు. అయినప్పటికీ వారి చలిని ఎందుర్కొంటారు. కాబట్టి చలి శరీంలోకి ప్రవేశించని, సరైన పొరలు గల దుస్తువులు ధరించడం చాలా ముఖ్యం. ఇందుకోసం మొదట టీషర్ట్‌ వేసుకొని ఆ తర్వాత పూర్తి చేతుల కవర్ అయ్యేలా స్వెటర్ ధరించండి. ఇలాంటి దుస్తువులు ధరించడం ద్వారా చలి నేరుగా మనకు తాకకుండా అడ్డుకుంటుంది. అలాగే బయట ఎంత బలమైన గాలులు వీచినా మన శరీరాలు లోపల నుండి వెచ్చగా ఉంటాయి.

3 / 5
 మట్టి కుండలు: సాధారణంగా మట్టికుండలు సహజ వెచ్చదనాన్ని అందిస్తాయి. కాబట్టి మీరు చలికాలంలో మట్టి కుండలలో వంట చేసుకోవడం అవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఆహారం ఎక్కువసేపు వెచ్చగా ఉంటుంది, శరీరానికి సహజ వేడిని అందిస్తుంది. మట్టి కుండలలో తయారుచేసిన టీ లేదా పాలు తాగడం వల్ల కూడా చలి ప్రభావాలను తగ్గించవచ్చు. అందువల్ల, మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మట్టి కుండలలో ఉడికించి తినడం ద్వారా మిమ్మల్ని మీరు వేడి చేసుకోవచ్చు.

4 / 5
రోజూ తేలికపాటి వ్యాయామం: శీతాకాలంలో జనాలు తరచుగా సోమరితనంగా ఉంటారు. మార్నింగ్ లేచేందుకు బాగా ఇబ్బంది పడుతారు. దీంతో మార్నింగ్ వర్కౌట్స్ చేయడం ఆపేస్తారు. కానీ చలిలో కాస్తా వ్యాయామం చేయడం ద్వారా మీరు శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూటలు నార్మల్‌ వాకింగ్‌కు వెళ్లినా సరిపోతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే చలి అనుభూతిని తగ్గిస్తుంది. అందువల్ల, శీతాకాలంలో వీలైనంత వరకు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది.

5 / 5