బీహార్లోని వైశాలిలో దొంగను అరెస్టు చేయడానికి వెళ్ళిన లాల్ గంజ్ పోలీసులు, ఏకంగా అతని ఇంట్లోనే కోట్ల విలువైన ఆభరణాలు చోరీ చేశారనే ఆరోపణలున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిని రికార్డుల్లో పాత పాత్రలు, టీవీ, తుక్కు సామాన్లుగా చూపారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.