Srinagar: దేవ భూమికి వెళ్తే శ్రీనగర్ ని సందర్శించండి.. ఉత్తరాఖండ్ ని రక్షిస్తున్న ధరి దేవిని దర్శించుకోండి..
ఉత్తరాఖండ్ కు వెళ్ళే వారు ఒక్కసారి అయినా శ్రీనగర్‌ని సందర్శించండి. ఇక్కడ ఉత్తరాఖండ్ ని కావాలా కాస్తున్న ధరిదేవి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ కేఫ్‌లో మీరు గడిపే సమయం అత్యుత్త సమయంగా నిలుస్తుంది. ఆఫ్టర్ కాలేజ్ కేఫ్‌లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ కేఫ్‌ని శివమ్ వర్మ, ఆదిత్య వర్మ నడుపుతున్నారు. స్థానిక ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు.
శ్రీనగర్ పేరు వినగానే ఎవరికైనా ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాజధాని శ్రీనగర్ గుర్తుకు వస్తుంది. అక్కడ అందమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయని పర్యాటకులు పోతెట్టుతారు. అయితే ఉత్తరాఖండ్‌లో కూడా అదే పేరుతో ఒక స్థలం ఉందని మీకు తెలుసా? అవును జమ్మూ కాశ్మీర్‌లోనే కాదు ఉత్తరాఖండ్‌లో కూడా శ్రీనగర్ ఉంది. పౌరీ గర్వాల్ గర్హ్వాల్ కొండలులో ఉన్న అతి పెద్ద పట్టణం. ఈ ప్రదేశం మైదానాన ప్రాంతాల్లో చివరి నగరం. ఇది గర్హ్వాల్ ప్రాంతంలో అతిపెద్ద నగరం,. అయితే శ్రీ నగర్ గురించి పర్యాటకులకు, ప్రయాణికులకు పెద్దగా తెలియదు. అయితే ఇక్కడ అందమైన ప్రకృతి ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంది. పర్వతాల్లో ప్రయాణించడం, ఎత్తైన ప్రదేశంలో ఉన్న కేఫ్‌లను ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. కొండ కోనల్లో టీ తాగుతూ స్పైసీ ఫుడ్ తింటే కలిగే ఆనందం గురించి ఎంత వర్ణించినా తక్కువే..
కేఫ్ ఉత్తమ ప్రదేశం
ఉత్తరాఖండ్ కు వెళ్ళే వారు ఒక్కసారి అయినా శ్రీనగర్‌ని సందర్శించండి. ఇక్కడ ఉత్తరాఖండ్ ని కావాలా కాస్తున్న ధరిదేవి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ కేఫ్‌లో మీరు గడిపే సమయం అత్యుత్త సమయంగా నిలుస్తుంది. ఆఫ్టర్ కాలేజ్ కేఫ్‌లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ కేఫ్‌ని శివమ్ వర్మ, ఆదిత్య వర్మ నడుపుతున్నారు. స్థానిక ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. శ్రీనగర్ బద్రీనాథ్ .. కేదార్నాథ్ కు వెళ్ళే మార్గంలో ఉం. కనుక తమ కేదార్నాద్ పర్యటన సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
శ్రీనగర్‌లోని ఖిర్సు-బుఘాని రోడ్‌లో ఉన్న బలోడి గ్రామంలో తాను ఒక కేఫ్ నడుపుతున్నట్లు శివమ్ చెప్పాడు. స్కూల్, కాలేజీ పిల్లలు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. అయితే దీనితో పాటు చాలా మంది భక్తులు కూడా శ్రీనగర్‌ను సందర్శించాలని కోరుకుంటారు.
ఇష్టమైన ఆహారం తింటూ ఎంజాయ్ చేయవచ్చు
ఈ పర్వతాలలో ప్రజలు తరచుగా టీ , కాఫీతో పాటు చైనీస్ ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇక్కడ చైనీస్ ఫుడ్ తో పాటు వెజ్, నాన్ వెజ్‌లో మెయిన్ కోర్స్ ఫుడ్ లభిస్తుంది. ఉదయం సమయంలో శ్రీనగర్ చుట్టూ తిరుగుతూ సాయంత్రం తీరికగా భోజనం చేయవచ్చు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ఈ ప్రదేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి
శ్రీనగర్‌లో మీరు ధరి దేవి ఆలయం, ఖిర్సు, కండోలియా, కోటేశ్వర్ ఆలయం, కేశోరాయ్ మఠం ఆలయం ,బాబా గోరఖ్‌నాథ్ గుహలను సందర్శించవచ్చు. ఇక్కడ వైకుంట చతుర్దశి జాతర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వార్షిక ఉత్సవం అక్టోబర్, నవంబర్‌లలో వస్తుంది.
ఎలా చేరుకోవాలంటే
శ్రీనగర్‌కు సమీప రైల్వే స్టేషన్‌లు కోట్‌ద్వార్ , రిషికేశ్ లు. ఈ రెండూ చిన్న స్టేషన్‌లు కనుక ఎక్కువగా ప్రధాన రైళ్లు ఇక్కడ ఆగవు. శ్రీనగర్‌కు సమీప ప్రధాన రైల్వే స్టేషన్ హరిద్వార్. ఈ నగరం నుంచి శ్రీనగర్ 130 కి.మీ దూరంలో ఉంది. హరిద్వార్ నుంచి శ్రీనగర్ కు బస్సులో ప్రయనించవచ్చు.