Vinayaka Chavithi: బొజ్జ గణపయ్యను 7వ రోజు నిమజ్జనం చేయాలనుకుంటున్నారా..! శుభ సమయం ఎప్పుడంటే

వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన పూజ అనంతరం ఆ విగ్రహాలను నదిలో నిమజ్జనం చేస్తారు. బప్పా విగ్రహాన్ని ఒకటిన్నర రోజులు, 3 రోజులు, 7 రోజులు లేదా 10వ రోజు అనగా అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. ఏడో రోజు వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఎవరైనా 7వ రోజు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకుంటే దానికి ఖచ్చితమైన సమయం తెలుసుకోవాలి.

Vinayaka Chavithi: బొజ్జ గణపయ్యను 7వ రోజు నిమజ్జనం చేయాలనుకుంటున్నారా..! శుభ సమయం ఎప్పుడంటే
Lord Ganesh Idols Immersion
Follow us
Surya Kala

|

Updated on: Sep 13, 2024 | 9:19 AM

వినాయక చవితి పండుగను దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జమ కార్యక్రమం కూడా మొదలైంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగుసి.. మెల్లగా బప్పా నిమజ్జన సమయం చెసే రోజు కూడా దగ్గర పడుతోంది. నిజానికి వినాయక నిమజ్జనం 10 రోజుల తర్వాత జరుగుతుంది. అయితే ఎవరైనా సరే వినాయక విగ్రహ నిమజ్జనం ముందు కూడా చేయవచ్చు. మీరు 7వ రోజు బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకుంటే.. శుభ సమయం. సరైన గ్రహ స్థితిలో బప్పా నిమజ్జనం చేస్తే, అది శుభప్రదంగా, ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

సెప్టెంబర్ 13 శుభ ముహూర్తాలు ఏమిటి?

వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన పూజ అనంతరం ఆ విగ్రహాలను నదిలో నిమజ్జనం చేస్తారు. బప్పా విగ్రహాన్ని ఒకటిన్నర రోజులు, 3 రోజులు, 7 రోజులు లేదా 10వ రోజు అనగా అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. ఏడో రోజు వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఎవరైనా 7వ రోజు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకుంటే దానికి ఖచ్చితమైన సమయం తెలుసుకోవాలి. పంచాంగం ప్రకారం శుభ ముహూర్తం ఉదయం 6.04 గంటలకు ప్రారంభమై 10.43 గంటల వరకు ఉంటుంది. అనంతరం రెండవ ముహూర్తం మధ్యాహ్నం 12:16 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 01:49 వరకు ఉంటుంది. సాయంత్రం శుభ సమయం అయితే గణపతి విగ్రహాన్ని సాయంత్రం 04:54 నుంచి 06:27 వరకు నిమజ్జనం చేయవచ్చు.

ఏ రోజు అత్యంత ముఖ్యమైనది?

వినాయకుడి పట్ల హిందువులకు అపారమైన భక్తి ఉంది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా భక్తులలో దేవుని పట్ల భిన్నమైన భక్తి భావన కనిపిస్తుంది. ముందుగా భక్తులు విగ్రహాన్ని తమ ఇంటికి తీసుకుని వచ్చి స్వాగతం పలుకుతారు. కొంతమంది 10 రోజుల పాటు తమ ఇళ్లలో ఉంచి పూజలు చేస్తారు. అనంతరం భక్తులు వాటిని నిమజ్జనం చేస్తారు. మల్లీ వచ్చే సంవత్సరం కలుద్దామంటూ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. ఐతే అనంత చతుర్థి రోజు.. అంటే 10వ రోజున స్వామిని పూజించి నిమజ్జనం చేయడం అత్యంత శుభప్రదం అని అంటారు.

ఇవి కూడా చదవండి

అనంత చతుర్దశి ఎప్పుడు?

2024 సంవత్సరంలో అనంత చతుర్దశి సెప్టెంబర్ 17న వస్తుంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి సెప్టెంబర్ 16, 2024 మధ్యాహ్నం 3:10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు సెప్టెంబర్ 17 రాత్రి 11:44 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో అనంత చతుర్దశిని సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి