Viral News: కేవలం రూ. 6 లక్షల ఖర్చుతో 27 దేశాలను చుట్టేసిన ఇద్దరు స్నేహితులు.. ఎలాగో తెలుసా?

ఇటలీకి చెందిన 25 ఏళ్ల టొమ్మసో ఫరీనమ్, స్పెయిన్‌కు చెందిన 27 ఏళ్ల అడ్రియన్ లఫుంటే తమ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనుకున్నారు. అందుకే అతను పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని మొదలు పెట్టారు. విమానంలో ప్రయాణించడానికి బదులుగా ఇద్దరూ పడవల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. గత 15 నెలల్లో వీరిద్దరూ 27 దేశాలను సందర్శించారు. స్నేహితులిద్దరూ తమను తాము 'స్థిరమైన' అన్వేషకులుగా పిలుచుకుంటారు.

Viral News:  కేవలం రూ. 6 లక్షల ఖర్చుతో 27 దేశాలను చుట్టేసిన ఇద్దరు స్నేహితులు.. ఎలాగో తెలుసా?
Two FriendsImage Credit source: Instagram/@project_kune
Follow us
Surya Kala

|

Updated on: Sep 13, 2024 | 8:58 AM

ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రదేశాల్లో పర్యటించడం, కొత్త విషయాలను అన్వేషించడం చాలా మందికి హాబీ. యూరప్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు ఫరీనమ్, లఫుంటే అనే ఒక యాత్రికులు గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని చుట్టేందుకు ప్రయాణాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ విమానంలో ప్రయనించ కూడా ఇప్పటి వరకు 27 దేశాలను సందర్శించడం వీరి ప్రయాణంలో అత్యంత ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి తోడ్పడటమే కాకుండా తమ డబ్బు కూడా ఆదా చేసుకున్నట్లు చెప్పారు.

ఇటలీకి చెందిన 25 ఏళ్ల టొమ్మసో ఫరీనమ్, స్పెయిన్‌కు చెందిన 27 ఏళ్ల అడ్రియన్ లఫుంటే తమ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనుకున్నారు. అందుకే అతను పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని మొదలు పెట్టారు. విమానంలో ప్రయాణించడానికి బదులుగా ఇద్దరూ పడవల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. గత 15 నెలల్లో వీరిద్దరూ 27 దేశాలను సందర్శించారు. స్నేహితులిద్దరూ తమను తాము ‘స్థిరమైన’ అన్వేషకులుగా పిలుచుకుంటారు.

ఇవి కూడా చదవండి

తన పర్యటన పర్యావరణాన్ని పరిరక్షించడమే కాదు డబ్బును కూడా ఆదా చేసిందన్నారు. స్నేహితులిద్దరూ కేవలం $7,700 (సుమారు రూ. 6,46,000)తో ఇప్పటివరకు 27 దేశాలను సందర్శించారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ వీరిద్దరూ మొదటిసారిగా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు పడవలో ప్రయాణించడం గురించి విన్నప్పుడు భయపడ్డామని చెప్పారు. ముఖ్యంగా ఎలాంటి అనుభవం లేకుండానే పసిఫిక్ సముద్రాన్ని దాటబోతున్నామని చెప్పారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

గల్ఫ్ ఆఫ్ పనామాను దాటడం అంత ఈజీ కాదని ఫరీనమ్ తెలిపింది. మొదటి 10 రోజులు చాలా ప్రమాదకరమైనవి. ఈ సమయంలో మేము తుఫానులు, బలమైన గాలులు , పెద్ద అలలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇలాంటి సమయంలో నీటిలో మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే తాము దైర్యాన్ని వదులుకోలేదని చెప్పారు. ఈ స్నేహితులిద్దరూ గత ఏడాది వేసవిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దక్షిణ అమెరికా చేరుకోవడానికి సముద్రంలో దాదాపు 39 రోజులు జర్నీ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..