Viral Video: ఈ బుడ్డోడు గుర్తున్నాడా.? మీమ్స్‌లో తెగ పాపులర్ అతడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..
ఎక్కువగా ఫన్నీ వీడియోలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఫన్నీ వీడియోల చాలా మంది మీమ్స్ కు వాడుతూ ఉంటారు. అలాంటి వాటిలో పైన కనిపిస్తున్న బుడ్డోడి వీడియో ఒకటి. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నోడు గుర్తున్నాడా.? అతన్ని చూడగానే నవ్వు ఆగదు.
సోషల్ మీడియాలో చాలా మంది మీమ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. చాలా రకాల వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా ఫన్నీ వీడియోలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఫన్నీ వీడియోల చాలా మంది మీమ్స్ కు వాడుతూ ఉంటారు. అలాంటి వాటిలో పైన కనిపిస్తున్న బుడ్డోడి వీడియో ఒకటి. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నోడు గుర్తున్నాడా.? అతన్ని చూడగానే నవ్వు ఆగదు. చాలా మీమ్స్ లో ఈ బుడతడి క్లిప్ ఉంటుంది. ఇంతకు అతను ఎవరు.? ఇప్పుడు ఆ బుడ్డోడు ఎలా ఉన్నాడో తెలుసా.?
మనదగ్గర క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఇతర దేశాల్లో ఫుట్ బాల్ కు అంత క్రేజ్ ఉంటుంది. ఫుట్ బాల్ మ్యాచ్ అంటే పడిచచ్చిపోతారు కొందరు. సాధారణంగా మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో పెద్ద స్క్రీన్ పెట్టి గేమ్ ను చూపిస్తుంటారు. దూరంగా కూర్చొని మ్యాచ్ చూసే వారి కోసం ఈ పెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేస్తారు. అలాగే చాలా మంది కెమెరామెన్స్ ఆ మ్యాచ్ ను షూట్ చేస్తూ ఉంటారు. మ్యాచ్ గ్యాప్ లో అడపాదడపా మ్యాచ్ చూడటానికి వచ్చిన సెలబ్రెటీలు జనాలను చూపిస్తూ ఉంటారు.
కెమెరా జనం వైపు తరగ్గానే పెద్ద స్క్రీన్ లో కనిపించాలని చాలా మంది అరవడాలు, కేకలు వేయడాలతో పాటు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. అలాగే పై ఫొటోలో ఉన్న బుడతడు కెమెరా తన వైపు చూపించగానే తన టీ షార్ట్ పైకి లేపి నాలుకతో చిత్ర విచిత్రంగా చేస్తూ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఇది 2013లో జరిగింది. అప్పటి నుంచి అతని వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ చిన్నోడు ఎలా ఉన్నాడో తెలుసా.? అతనికి సంబందించిన లేటెస్ట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పుడు ఎలా అయితే చేశాడో ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..