AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2024: ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకులు..చూసి పరవశించిన భక్తులు

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి యేటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ మాసాన్ని గణేషుడికి అంకితం చేసారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7 న వచ్చింది. ఆ రోజున గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా చాలా మంది గణపతి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఉదయం, సాయంత్రం పూజలు చేసి తొమ్మిదవ రోజున విగ్రహ నిమజ్జనం చేస్తారు.

Jyothi Gadda
|

Updated on: Sep 12, 2024 | 10:09 PM

Share
వినాయక చవితి. అంటేనే వీధులన్ని కోలాహాలంగా మారుతాయి..రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించిన మండపాల్లో అంతే అందంగా ముస్తాబు చేసిన వినూత్న రీతుల్లో భారీ వినాయక విగ్రహలు కొలువుదీరి నవరాత్రులు పూజలందుకుంటాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ఎవరికీ తోచిన విధంగా వారు వినాయక ప్రతిమలు తయారు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు.

1 / 5
ప్రస్తుతం వినాయక పండుగ వాతావరణం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇళ్లలో చేసే ఏ శుభకార్యాలైన గణపతి పూజ తర్వాతే మిగిలిన పనులు చేస్తారు. ఇక వినాయక చవితి పండుగ వచ్చిందంటే అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు.

2 / 5
క్రమంలోనే హైదరాబాద్‌లోని ఒక చోట ఏర్పాటు చేసిన ముత్యాల గణేషుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. ఇందుకోసం మొత్తం 11, 116 ముత్యాలను అతికించి అద్భుతంగా తయారు చేశారు. 
ఈ విగ్రహం అందర్ని ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ముత్యాల గణేషుడిని చూసి దర్శనం చేసుకుందామని భక్తులు ఎగబడుతున్నారు. ముత్యాల గణపతిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

క్రమంలోనే హైదరాబాద్‌లోని ఒక చోట ఏర్పాటు చేసిన ముత్యాల గణేషుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. ఇందుకోసం మొత్తం 11, 116 ముత్యాలను అతికించి అద్భుతంగా తయారు చేశారు. ఈ విగ్రహం అందర్ని ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ముత్యాల గణేషుడిని చూసి దర్శనం చేసుకుందామని భక్తులు ఎగబడుతున్నారు. ముత్యాల గణపతిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

3 / 5
వివిధ రూపాల్లో కొలువు దీరిన విఘ్నేశ్వరుడి మండపాలు, విగ్రహలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. నెమలి పించం అలంకరణతో తయారు చేసిన గణపతి విగ్రహం భక్తులను మరింత ఆకట్టుకుంటోంది. పూర్తిగా నెమలి పించాలతో అలంకరించబడిన లంభోదరుడి రూపం చూసిన భక్తులు పరవశించిపోతున్నారు.

4 / 5
ఒకప్పుడు గణపతికి పూజ చేయాలంటే వివిధ రకాల పుష్పాలను సేకరించి వాటిని దండలుగా చేసి కట్టేవారు. కానీ ప్రస్తుతం స్వామివారికి పుష్పాల స్థానంలో కరెన్సీ నోట్లను దండలుగా రూపొందించి తమ భక్తిని చాటుకుంటున్నారు. కొన్ని చోట్ల పెద్ద మొత్తంలో కరెన్సీనోట్లతో వినాయక మండపాలు తయారు చేసి, భక్తితో స్వామివారిని కోలుస్తున్నారు భక్తులు.

5 / 5