Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sesame oil Lamp: పూజ సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటో తెలుసా..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనె దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. పూజ సమయంలో దీపం వెలిగించడం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. దీపం లేకుండా, పూజ అసంపూర్తిగా భావించి, భగవంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం ద్వారా పూజ పూర్తవుతుంది. వివిధ నూనె దీపాలను వెలిగించడం హిందూ మతంలో దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆవనూనె కంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

Sesame oil Lamp: పూజ సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటో తెలుసా..
Lamp Of Sesame Oil
Surya Kala
|

Updated on: Sep 13, 2024 | 9:47 AM

Share

హిందూ మతంలో పూజకు, దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ దీపాన్ని ఆవు నెయ్యి, నువ్వుల నూనె, మల్లి నూనె, ఆవ నూనె వంటి వివిధ రకాలుగా వెలిగిస్తారు. అయితే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం హిందూ మతంలో ఒక పురాతన, పవిత్రమైన సంప్రదాయం. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుందని, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనె దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. పూజ సమయంలో దీపం వెలిగించడం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. దీపం లేకుండా, పూజ అసంపూర్తిగా భావించి, భగవంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం ద్వారా పూజ పూర్తవుతుంది. వివిధ నూనె దీపాలను వెలిగించడం హిందూ మతంలో దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆవనూనె కంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు.

నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల వాతావరణంలో ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది. తద్వారా పర్యావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దీని ద్వారా సాధకుడికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అంతేకాదు ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నురాలై భక్తుడిని కరుణిస్తుంది. అంతేకాదు ప్రతికూల శక్తి కూడా ఇంట్లోకి ప్రవేశించదు.

పురాణ గ్రంధాల ప్రకారం నువ్వుల నూనె చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. పూజ సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన సంతోషం నెలకొంటుంది. అంతేకాదు ఈ నువ్వుల నూనె ప్రత్యేక ప్రాముఖ్యత శనిశ్వరుడికి జోడించబడింది. శనిశ్వరుని కోపాన్ని శాంతపరచడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోతాయి

నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వలన జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. అంతేకాదు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో పురోగతికి అవకాశాలను సృష్టిస్తుంది. జాతకంలో చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది. గ్రహ దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

నువ్వుల నూనె దీపం వెలిగించేటపుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు నువ్వుల నూనె దీపం వెలిగించడానికి ఎరుపు దారంతో చేసిన ఒత్తి ఉత్తమంగా పరిగణించబడుతుంది. దేవతలకు ఎడమ వైపున నువ్వుల నూనె దీపం వెలిగించాలి. అలాగే పూజ మధ్యలో దీపం ఆరిపోకూడదు. ఇలా పూజ మధ్యలో దీపం గనుమైతే పూజ పూర్తి ఫలితం దక్కదు.

నువ్వుల నూనె ప్రాముఖ్యత

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనెతో దీపం వలన వాతావరణంలో సువాసన వ్యాపిస్తుంది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం, రాహు-కేతు దోషాలు మొదలైన గ్రహ దోషాలు తొలగిపోతాయి. నువ్వుల నూనెను దేవతలకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా వారు ప్రసన్నులై భక్తులపై తమ దీవెనలు కురిపిస్తారు. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి