అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఆకట్టుకుంటున్న సంగీత కచేరి గణనాథులు..!

ప్రసిద్ధి చెందిన ఆలయంలో వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరి వినాయకులు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఆకట్టుకుంటున్న సంగీత కచేరి గణనాథులు..!
Musical Ganesh
Follow us

|

Updated on: Sep 13, 2024 | 2:27 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి సంగీత కచేరి వినాయకులు. ప్రసిద్ధి చెందిన ఆలయంలో వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరి వినాయకులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. కదలాడే విధంగా ఏర్పాటు చేసిన వినాయకులు సంగీతం వాయిస్తున్నట్టు, డోలు, గిటారు, వీణ, మృదంగం, తబలా ఇలా అనేక రకాల సంగీత కచేరి వాయిస్తున్నట్టు ఏర్పాటు చేసిన కదలాడే వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఆలయానికి వచ్చే భక్తులు విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని విశేషంగా ఏర్పాటు చేసిన కదలాడే వినాయకులను చూసి అందరూ మంత్రముగ్ధులు అవుతున్నారు. సంగీతం వాయించే వినాయకులను చూసి నిజంగా వినాయకులే వాయిస్తున్నట్టుగా ఏర్పాటు చేసిన సంగీత కచేరి వినాయకులు ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరి వినాయకులను చూసి సెల్ఫీలు తీసుకుని సందడి చేస్తున్నారు భక్తులు. నవరాత్రి ఉత్సవాలలో ఆలయంలో ఈ సంగీత కచేరి వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..