Tiny Island: ప్రపంచంలో రాజధాని లేని దేశం ఉందని తెలుసా..! అతి చిన్న ద్వీప దేశం భూతల స్వర్గమే..

ప్రపంచంలో అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం లేదు. అదే విధంగా దేశంలో రాష్ట్రాలకు రాజధాని, జిల్లాలు వంటి వాటికి ప్రధాన నగరాలు పరిపాలన కేంద్రాలుగా ఉంటాయి. అయితే మన దేశంలో పదేళ్లకు పైగా రాజధాని అంటూ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇప్పటికే ఈ విషయంపై రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటారు నెటిజన్లు.. అయితే అసలు ప్రపంచంలోనే రాజధాని అంటూ లేని దేశం ఒకటి ఉందని తెలుసా..!

Tiny Island: ప్రపంచంలో రాజధాని లేని దేశం ఉందని తెలుసా..! అతి చిన్న ద్వీప దేశం భూతల స్వర్గమే..
Nauru Country
Follow us

|

Updated on: Sep 13, 2024 | 11:28 AM

పూర్వం రాజుల కాలంలోనైనా.. ఇప్పటి ఆధునిక కాలంలోనైనా సరే రాజధాని నేక ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. ఒక ప్రధాన నగరాన్ని ఎంపిక చేసుకుని దాని ఆధారంగా రాజ్యాన్ని లేదా దేశాన్ని పాలిస్తారు. నాటి రాజుల కాలం నుంచి నేటి దేశాల కాలం వరకూ ప్రపంచంలో అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం లేదు. అదే విధంగా దేశంలో రాష్ట్రాలకు రాజధాని, జిల్లాలు వంటి వాటికి ప్రధాన నగరాలు పరిపాలన కేంద్రాలుగా ఉంటాయి. అయితే మన దేశంలో పదేళ్లకు పైగా రాజధాని అంటూ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇప్పటికే ఈ విషయంపై రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటారు నెటిజన్లు.. అయితే అసలు ప్రపంచంలోనే రాజధాని అంటూ లేని దేశం ఒకటి ఉందని తెలుసా..!

ప్రపంచంలోనే రాజధాని లేని దేశం ఉంది. అయినా సరే ఆ దేశం తమ దేశ కార్యాకలపాలను రాజధాని లేకుండా చక్కగా నిర్వహిస్తోంది. ఈ దేశం పేరు నౌరు అనే ద్వీప దేశం. ఈ దేశం గురించి అతి తక్కువ మందికి తెలుసు. ప్రపంచంలో అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం నౌరూ ఒక్కటే. ప్రపంచంలో అతిపెద్ద ద్వీప దేశం ఇండోనేషియా.. అయితే అతి చిన్న ద్వీప దేశం నౌరు.

నౌరు దేశం మైక్రోనేషియన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. కేవలం ఈ దేశం 21 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది. చిన్న బంగాళదుంప ఆకారంలో కనువిందు చేసే ఈ దేశంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే దీనిని ‘ఆహ్లాదకరమైన ద్వీపం’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర రిపబ్లిక్ దేశం అతి తక్కువ జనాభా గల దేశాల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 2018 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో కేవలం 11 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ నివసించే వారు కొందరు క్రైస్తవ మతాన్ని నమ్మితే.. కొందరు అసలు ఏ మతాన్ని నమ్మని వారు కూడా ఉన్నారు. అంతేకాదు ఈ దేశానికి ప్రత్యేకంగా రక్షణ వ్యవస్థ అంటూ ఏమీ లేదు. ఈ ద్వీప దేశ రక్షణ బాధ్యతలను ఆస్ర్టేలియా పర్యవేక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ దేశం గురించి ప్రజలకు ఎక్కువగా తెలియకపోవడంతో పెద్దగా పర్యాటకుల రద్దీ కూడా ఉండదు. ఈ దేశంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది.. దీని పేరు నౌరు అంతర్జాతీయ విమానాశ్రయం.

ఈ దేశాన్ని 12 తెగలు పాలించారని.. 3 వేల సంవత్సరాల క్రితం మైక్రోనేషియన్లు, పాలినేషియన్లు వచ్చి స్థిరపడినట్లు చెబుతారు. ఈ ప్రాంతంలో సముద్ర పక్షుల విసర్జితాలు గుట్టలుగా పేరుకుపోయి కాలక్రమంలో అవి పాస్ఫేట్‌ నిల్వలుగా రూపాంతరం చెందాయి. దీంతో 60 నుంచి 70 దశకంలో ఈ దేశ ప్రజల ప్రధాన ఆదాయ వనరు ఫాస్ఫేట్ మైనింగ్‌గా ఉండేది. అప్పుడు నౌరూ దేశం అత్యంత ధనిక దేశంగా పేరుగాంచింది. అయితే దోపిడీ కారణంగా కలాక్రమంలో ఈ పాస్ఫేట్‌ నిల్వలు తగ్గి దేశ ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా మిగిలింది. ఇక్కడ కొబ్బరి అధికంగా ఉత్పత్తి అవుతుంది. రాజధాని లేకపోయినా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో మెరుగ్గా రాణిస్తోంది. కామన్వెల్త్‌ గేమ్స్‌, ఒలింపిక్స్‌లో నౌరూ దేశ క్రీడాకారుల ప్రాతినిధ్యం తప్పని సరిగా ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోదారి తీరాన ఎరుపెక్కిన ఆకాశం.. యానాంలో అద్భుత దృశ్యం.
గోదారి తీరాన ఎరుపెక్కిన ఆకాశం.. యానాంలో అద్భుత దృశ్యం.
అలా ఎలా పార్కింగ్ చేశినవ్ భయ్యా ! | గణేష్ మండపంలో గజదొంగ.
అలా ఎలా పార్కింగ్ చేశినవ్ భయ్యా ! | గణేష్ మండపంలో గజదొంగ.
నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..
నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..
కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!
కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!
మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.
మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.
చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.
చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.
విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు
విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.
నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!
నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!