మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు ఉన్నాయా?
sesame seeds: సైజులో చిన్నవిగా ఉన్నా.. చేసే మేలులో ఇవి మహా ఘనమైనవి. వంటింట్లో ఉండే తెల్ల నువ్వులు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. రోజూ ఒక్క స్పూన్ నువ్వులు తీసుకుంటే మీ ఎముకల నుంచి గుండె వరకు అన్నీ భద్రమే. అసలు నువ్వులలో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనం వంటింట్లో పోపుల డబ్బాలో ఉండే నువ్వులను కేవలం రుచి కోసం వాడతాం. కానీ ఆ చిన్న గింజల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదంలో తెల్ల నువ్వులను ఒక గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. శారీరక శక్తిని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే అద్భుత పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
తెల్ల నువ్వులను మీ దైనందిన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే మేలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇనుములాంటి ఎముకలు మీ సొంతం
వయసు పెరిగే కొద్దీ వచ్చే అతిపెద్ద సమస్య ఎముకల బలహీనత. తెల్ల నువ్వులలో కాల్షియం అద్భుతమైన స్థాయిలో ఉంటుంది. రోజూ ఒక చెంచా నువ్వులు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా ఎముకలు దృఢంగా తయారవుతాయి.
గుండె పదిలం.. కొలెస్ట్రాల్ ఖతం
నువ్వులలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి, ధమనులలో అడ్డంకులు కలగకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మెరిసే చర్మం.. నల్లని జుట్టు
విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే నువ్వులు అందానికి కూడా కేరాఫ్ అడ్రస్. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. అలాగే జుట్టు రాలడాన్ని అరికట్టి, కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
డయాబెటిస్ నియంత్రణలో..
మధుమేహంతో బాధపడేవారికి నువ్వులు మంచి ఆహారం. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
జీర్ణక్రియకు ఫైబర్ టానిక్
మలబద్ధకం సమస్యతో బాధపడేవారు నువ్వులను రోజూ తీసుకోవాలి. వీటిలో ఉండే అధిక పీచు పదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తొలగించి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్
మీరు తరచుగా అలసటగా, బలహీనంగా అనిపిస్తున్నారా..? అయితే నువ్వులు మీకోసమే. వీటిలోని ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తాయి.
వ్యాధి నిరోధక శక్తి పెంపు
జింక్, సెలీనియం, రాగి వంటి ఖనిజాలు నువ్వులలో ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి.
చిన్న నువ్వు గింజల్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. లడ్డూల రూపంలోనో లేదా కూరల్లో పొడి రూపంలోనో రోజూ ఒక చెంచా నువ్వులను తీసుకుంటే.. ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిన పని లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
