Singer Nagavva : ఒక్క పాట కోసమే 3 సంవత్సరాలు.. బాయిలోనే బల్లి పలికే పాటకు ఎన్ని కోట్లు వచ్చాయంటే.. సింగర్ నాగవ్వ..
బాయిలోన బల్లి పలికే పాటతో ఫేమస్ అయ్యారు జానపద గాయని నాగవ్వ. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. దీంతో నాగవ్వ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ పాటకు మూడు సంవత్సరాలు శ్రమ పడినట్లు ఆమె కుమారుడు తిరుపతి రెడ్డి తెలిపారు. నాగవ్వ టాలెంట్ ఏ వయస్సుకూ పరిమితం కాదని నిరూపించింది.

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంగ్ బాయిలోనా బల్లి పలికే. అక్షరాలు రాకపోయినా అద్భుతమైన గాత్రంతో జనాలను ఉర్రూతలూగించారు. ఒక్క పాటతోనే ఆమె పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరే చుంచు నాగవ్వ. తాజాగా గాయని మంగ్లీతో కలిసి ఆమె పాడిన పాట లక్షల మందిని ఆకర్షించడమే కాకుండా ఇప్పుడు చిన్నా, పెద్ద అందరూ కాలు కదుపుతున్నారు. జగిత్యాల జిల్లాలోని గుల్లకోటకు చెందిన నాగవ్వ.. ఇప్పుడు తెలంగాణ జానపదాలతో నెట్టింట తెగ ఫేమస్ అయ్యింది. ఒక్క పాటతోనే ఇండియాను షేక్ చేస్తుంది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవ్వ తన నిజ జీవితం గురించి, తన పాటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
జగిత్యాల జిల్లాలోని గుల్లకోట గ్రామానికి చెందిన నాగవ్వ మొదట సారంగ దరియా అనే టీవీ షోలో పాల్గొన్నాని.. కానీ అప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ భయం కారణంగా ఆమె మొదటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ, న్యాయనిర్ణేతలు కాసర్ల శ్యాం, భీమ్స్ సిసిరోలియో, చిన్నార్జున్ వంటి ప్రముఖులు తన ప్రతిభను గుర్తించి తనను ప్రోత్సహించారు. వారి ఆలోచన మేరకు దామోదర్ రెడ్డి, మంగ్లీలకు నాగవ్వను పరిచయం చేశారు. బాయిలోనా బల్లి పలికే పాటతో పాపులర్ అయ్యింది. రాక్షస కావ్యం సినిమా కోసం ఎంపికైన ఈ పాట, సినిమాలో కుదరకపోవడంతో మంగ్లీ టీమ్ దీనిని వ్యక్తిగతంగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఒక్క పాట కోసమే నాగవ్వ మూడు సంవత్సరాలు వేచి చూశారు. ఈ పాటను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో, ఈ సమయంలో ఆమెను మరే ఇతర పాటలు పాడనివ్వలేదని ఆమె చిన్న కుమారుడు తిరుపతి రెడ్డి తెలిపారు. మంగ్లీ మేడం టీమ్ ఖర్చుకు వెనుకాడకుండా, పగలు రాత్రి కష్టపడి ఈ పాటను మూడు రోజుల్లో చిత్రీకరించిందని. పాట సాహిత్యం కోసం నాగవ్వ అందించిన ట్యూన్‌లకు కమల్ స్లావత్ అన్న లిరిక్స్ అందించగా, సురేష్ బబ్లీ సంగీతం సమకూర్చారని తెలిపారు.
నాగవ్వ కుమారుడు తిరుపతి రెడ్డి ఫోక్ డైరెక్టర్‌గా, నటుడిగా, లిరిసిస్ట్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తల్లి పాడిన “తిరుపతి రెడ్డి” అనే పాటతోనే తను లిరిసిస్ట్ గా పరిచయం అయ్యారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి సల్మాన్ ఖాన్ చిత్రంలోనూ నాగవ్వ బతుకమ్మ పాట పాడారు. బాయిలోన బల్లి పలికే పాట విడుదలై ప్రపంచం మొత్తం వినేటట్టు బల్లి పలికినట్టు అయ్యిందని నాగవ్వ సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు.
ఇటీవల ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరాఠీ పాట కాపీ అనే ఆరోపణలను ఆయన ఖండించారు. జనాలు నిజాలు తెలుసుకోకుండా ట్రోల్స్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ పాట తమ అమ్మ నాన్నలకు ఇచ్చిన పాట అని, దీనికి మంగ్లీ టీమ్ అద్భుతమైన రూపం ఇచ్చిందని స్పష్టం చేశారు. అయితే ఈ పాట కోసం మంగ్లీ టీమ్ దాదాపు 15 లక్షలకుపైగానే ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..




